పిస్తాను రెగ్యులర్‌గా ఎందుకు తినాలో తెలుసా!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jan 07, 2024

Hindustan Times
Telugu

పిస్తా పప్పులో ప్రొటీన్, యాంటిఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే చాలా బెనెఫిట్స్ లభిస్తాయి. రెగ్యులర్‌గా పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే.. 

Photo: Unsplash

శరీరంలో కొలెస్ట్రాల్‍ను పిస్తా కంట్రోల్ చేయగలదు. అందుకే ఇవి తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Photo: Unsplash

బరువు తగ్గాలనుకునే వారు పిస్తాను స్నాక్‍గా తింటే చాలా మేలు. పిస్తాల్లో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

Photo: Unsplash

పిస్తాల్లో కరేటొనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే కంటి చూపు కూడా మెరుగవుతుంది.  

Photo: Unsplash

పిస్తాలు తినవడం వల్ల శరీరానికి ఐరన్ పుష్కలంగా అందుతుంది. 

Photo: Pexels

పిస్తాల్లో విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరుకు ఇది చాలా మేలు చేస్తుంది. 

Photo: Pexels