సమోసాలు చాలా రుచికరంగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే, వారానికి రెండు, మూడుసార్లు మితంగా సమోసాలు తింటే ఓకే. కానీ ప్రతీ రోజు సమోసాలు ఎక్కువగా తింటే కొన్ని ఇబ్బందులు తప్పవు.
Photo: Unsplash
సమోసాల్లో మసాలాలు ఎక్కువగా ఉంటాయి. నూనెలో ఫ్రై చేస్తారు. అందుకే వీటిని రోజూ తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. డైలీ సమోసాలు తింటే కలిగే దుష్ఫలితాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Unsplash
సమోసాల్లో క్యాలరీలు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతీ రోజూ వీటిని తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఊబకాయం రావొచ్చు.
Photo: Unsplash
సమోసాలను నూనెలో వేయిస్తారు. వీటికి నూనెను ఎక్కువగా వాడుతారు. అందుకే సమోసాలను ప్రతీ రోజు తింటే చర్మంపై మొటిమలు, మచ్చలు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది.
Photo: Unsplash
సమోసాలను రోజూ తింటే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగవచ్చు. అలాగే బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది గుండెకు అంత మంచిది కాదు.
Photo: Unsplash
సమోసాలను ప్రతీ రోజూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగే రిస్క్ ఉంటుంది. అందుకే సమోసాలు వారానికి రెండు, మూడుసార్లు మితంగా తినాలే కానీ.. ప్రతీరోజూ తీసుకుంటే ఈ ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
Photo: Unsplash
ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు హోంవర్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.