కొన్ని రకాల పండ్ల తొక్కల్లో పోషకాలు, ఎక్స్‌ఫ్లోయిటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఏ పండ్ల తొక్కలను రాసుకుంటే చర్మం మెరుపు పెరుగుతుందో ఇక్కడ చూడండి.
Photo: Pexels
నారింజ పండు తొక్కలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తొక్కను చర్మానికి రాసుకుంటే కొలాజెన్ ఉత్పత్తి పెరిగేందుకు తోడ్పడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తగ్గిస్తుంది. చర్మం మెరుపు పెరుగుతుంది.
Photo: Pexels
బొప్పాయి తొక్కలో పపైన్ ఉంటుంది. చర్మం మెరుపుతో పాటు మృధుత్వాన్ని కూడా ఇది పెంచుతుంది.
Photo: Pexels
అరటి పండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. చర్మం తేమగా, మెరుపుతో ఉండేందుకు ఈ తొక్క రాసుకోవడం సహకరిస్తుంది.
Photo: Pexels
నిమ్మ తొక్కలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే అదనపు జిడ్డు తొలగిపోతుంది. చర్మపు మెరుపు మెరుగవుతుంది.
Photo: Pexels
యాపిల్ పండు తొక్కలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కను రాసుకుంటే చర్మంపై ముడతలు తగ్గే అవకాశం ఉంటుంది. మెరుపు అధికమవుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి