నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు తోడ్పడే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 30, 2024

Hindustan Times
Telugu

నాడీ వ్యవస్థ శరీరంలో చాలా ముఖ్యమైనది. మెదడు, శరీరానికి అనుసంధానంగా ఉండే ఈ వ్యవస్థ.. మనం ఏ పని చేయాలన్నా కీలకంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Photo: Pexels

పాలకూర, బచ్చలి లాంటి ఆకుకూరల్లో విటమిన్ సీ, విటమిన్ ఈ, విటమిన్ బీ, మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. అందుకే ఆకుకూరలు తినడం వల్ల నాడీ వ్యవస్థకు మెరుగ్గా ఉంటుంది.

Photo: Pexels

దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెెంట్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. మెదడు కణాలు రాడికల్ డ్యామేజ్ కాకుండా ఇది రక్షించగలదు. మెదడు పనితీరు మెరుగుపడటంతో తోడ్పడుతుంది. 

Photo: Pexels

కోడిగుడ్లలో కోలిన్ ఎక్కువగా ఉంటుంది. మెదడు పనీతీరును ఇంప్రూవ్ చేసే అసిటిల్‍సోనిన్ ఉత్పత్తికి ఇది కీలకంగా ఉంటుంది. అందుకే గుడ్డు తినడం వ్యల్ల నాడీవ్యవస్థకు మంచి జరుగుతుంది. 

Photo: Pexels

బాదం, జీడిపప్పు లాంటి నట్స్‌లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. నాడీ వ్యవస్థకు ప్రశాంతంగా ఉండేలా ఇది తోడ్పడుతుంది. తద్వారా ఈ వ్యవస్థ పనితీరును  నట్స్ మెరుగుపరచగలవు.

Photo: Pexels

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి మెదడు పని తీరు మెరుగుపడటంలో తోడ్పడతాయి. 

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels