బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే 5 రకాల నట్స్ ఇవి

Photo: Pixabay

By Chatakonda Krishna Prakash
Nov 28, 2023

Hindustan Times
Telugu

బరువు తగ్గాలనుకునే (వెయిట్ లాస్) వారు ఆహారం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించాలి. కొన్ని రకాల నట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ వేగవంతం అవుతుంది. అలాగే, బరువు తగ్గడానికి తోడ్పడే ఐదు రకాల నట్స్ ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pixels

అక్రోటుకాయ (వాల్‍నట్)లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కావాల్సిన పోషకాలు ఉంటాయి. దీంతో ఇవి శరీరంలోని కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయి. వాపులను కూడా తగ్గించగలవు. ఇవి ఆహారంలో తీసుకుంటే తరచూ ఆకలి కాకుండా కూడా చేస్తాయి. 

Photo: Pixabay

జీడిపప్పుల్లో మెగ్నిషియమ్, ప్రొటిన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి మీ డైట్‍లో తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. చీటికిమాటికి ఆహారం తినాలనిపించదు. ఇలా వెయిట్ లాస్‍కు జీడిపప్పు ఉపయోగపడుతుంది. 

Photo: Pixabay

బాదంపప్పులో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మీకు సంతృప్తి పెరిగి.. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.

Photo: Pixabay

పిస్తా పప్పులో క్యాలరీలు చాలా తక్కువగా.. ప్రోటీన్ కంటెంట్ మెడుగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు పిస్తా పప్పు తింటే మేలు జరుగుతుంది. 

Photo: Pixabay

బ్రెజిల్ నట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, సెలెనియమ్ అధికంగా ఉంటాయి. దీంతో ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడతాయి.

Photo: Pixabay

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels