కొన్ని రకాల విత్తనాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Photo: Pexels
విత్తనాలు దీర్ఘ కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచగలవు. వ్యాధికారకాలతో పోరాడే ఇమ్యూనిటీని పెంచగలవు. అలా.. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచగల 4 రకార విత్తనాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
గుమ్మడి విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీంతో వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
అవిసె గింజల్లో ఉన్న పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు, మంటను తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచగలదు.
Photo: Pexels
చియా సీడ్స్ (సబ్జా గింజలు)లోని పోషకాలు రోగ నిరోధక శక్తితో పాటు జీవక్రియలను కూడా మెరుగుపరుస్తాయి. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడతాయి.
Photo: Pexels
నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.
Photo: Pexels
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.