జీవితం సవాలు విసిరితే.. టీమిండియాలా పోరాడి గెలువు

ANI

By Sharath Chitturi
Jun 30, 2024

Hindustan Times
Telugu

2024 టీ20 వరల్డ్​ కప్​లో భారత జట్టు గెలిచింది. కానీ ఇది అంత సులభంగా రాలేదు! అందుకే ఈ గెలుపుతో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

ఈ వరల్డ్​ కప్​లో విరాట్​ కోహ్లీ ఫామ్​లో లేడు. కానీ ఫైనల్​లో జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో వికెట్లు పడినా, మరో ఎండ్​లో కోహ్లీ పోరాడాడు.

మనకంటూ టైమ్​ వస్తుంది, అప్పుడు మన సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు అనేందుకు కోహ్లీ ఉదాహరణ.

రెండో ఇన్నింగ్స్​లో విధ్వంసం సృష్టించి, భారత అభిమానులను షేక్​ చేశాడు హెన్రిక్స్​ క్లాసెన్​. అతని వికెట్​ని పడగొట్టి, మ్యాచ్​ని ఇండియావైపు తిప్పాడు హార్దిక్​ పాండ్య.

హార్దిక్​ పాండ్య గత ఆరు నెలలుగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ ఇప్పుడు వరల్డ్​ కప్​ హీరో అయ్యాడు. కష్టపడితే టైమ్​ వచ్చినప్పుడు పరిస్థితులు మారతాయనేందుకు పాండ్య సహనం చక్కటి ఉదాహరణ.

ఫైనల్​ ఓవర్​లో కళ్లు చెదిరే క్యాచ్​ పట్టి మిల్లర్​ని సూర్య కుమార్​ యాదవ్​ పెవీలియన్​కి పంపించాడు. ఎంత ఒత్తిడి పరిస్థితులనైనా ప్రశాంతంగా ఎదుర్కోవాలని నిరూపించాడు.

సౌతాఫ్రికా బ్యాటర్ల విధ్వంసంతో మ్యాచ్​ చెయ్యి దాటిపోయింది. కానీ టీమిండియా చివర్లో అద్భుతం చేసింది. చివరి నిమిషం వరకు పోరాడితే విజయం సాధ్యం అని నిరూపించింది.

కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేస్తోంది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

twitter