బతుకమ్మ సంబరాలు ఏటా పెతరమాస రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
photo credit to twitter
By Maheshwaram Mahendra Chary Oct 13, 2023
Hindustan Times Telugu
బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు.
photo credit to twitter
బతుకమ్మను పేర్చేటప్పుడు పూల కాడలను చేతులతో తుంచి పెడతారు. కత్తితో కట్ చేసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు.
image credit to facebook
బతుకమ్మను పేర్చే ఒకరోజు ముందే పూలను సేకరిస్తారు. అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెబుతుంటారు.
photo credit to facebook
ముందు రోజు పూలను సేకరించడం వల్ల మొగ్గలుగా ఉన్న పూలను తెచ్చుకొని బతుకమ్మను పేర్చుతున్నప్పుడు నోటితో పూలను ఊది వాటిని పేరుస్తారు. అలా పూలతో పేర్చిన కారణంగా ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారనే వాదన కూడా ఉంది.
photo credit to twitter
ఎంగిలిపూల బతుకమ్మ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
image credit to facebook
కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత బతుకమ్మ పేరుస్తారని... అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందంటారు.
photo credit to twitter
బతుకమ్మను పేర్చిన తర్వాత పూజ గది ముందు ఉంచుతారు. సాయంత్రం సమయంలో గల్లీల వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. ఇలా ఆడిన తర్వాత చెరువు గట్టు వద్దకు వెళ్లి నిమజ్జనం చేస్తారు.
photo credit to twitter
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి