మేడారం మహాజాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
జాతర సందర్భంగా మేడారం పరిసరాలు జన సందోహంతో నిండిపోయాయి.
కోట్లాది మంది భక్తులు కొంగు బంగారం అయిన సమ్మక్క సారలమ్మ జాతరలో కోయ దొరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
కొందరు కోయదొరలు జ్యోతిషం కూడా చెబుతున్నారు.
దట్టమైన అడవులలో దొరికే అనేక రకాల వనమూలికల మొక్కలు ,వేర్లు, చెట్ల కొమ్మలను తీసుకువచ్చి జాతరకు వచ్చే భక్తులకు విక్రయిస్తున్నారు.
సమ్మక్క సారలమ్మల ఉపవాస దీక్ష చేపట్టి నిష్ఠతో పూజలు నిర్వహించి ఈ మూలికలను తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.
కోయదొరలు తీసుకువచ్చిన అనేక మూలికలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు.
చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలి ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. శీతాకాలంలో పెదవుల సంరక్షణకు ఈ చిట్కాలు పాటించండి.