ఏపీలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం 

pixabay

By Bandaru Satyaprasad
Jul 02, 2023

Hindustan Times
Telugu

వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 

pixabay

సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో  మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

pixabay

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

pixabay

బుధవారం  పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో  మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.   

pixabay

భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉంది. 

pixabay

పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపింది. రైతులు, రైతు కూలీలు చెట్ల కిందకు అస్సలు వెళ్లవద్దని పేర్కొంది.

pixabay

నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

pixabay

అతిగా ఆకలిని అవుతోందా? ఇవి తింటే కంట్రోల్‍లో ఉంటుంది!

Photo: Pexels