Agent Release Date: ఏజెంట్ కోసం వెనక్కి వెళ్లనున్న భోళా శంకర్ - అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఇదేనా
Agent Release Date: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. భోళా శంకర్ వాయిదా పడే అవకాశాలు ఉండటంతో అదే రోజున ఏజెంట్‌ను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
భోళా శంకర్ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో చిరంజీవి సినిమా వాయిదాపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి వెనక్కి వెళ్లిపోవడంతో ఆ రిలీజ్ డేట్‌ను అఖిల్ అక్కినేని ఏజెంట్ కోసం ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
భోళా శంకర్, ఏజెంట్ సినిమాలను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకే ప్రొడక్షన్ హౌజ్‌లో రూపొందుతోన్న సినిమాలు కావడంతోనే ఈ డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ ఈజీగానే పూర్తయినట్లు సమాచారం.
అఖిల్ ఏజెంట్ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఎయిట్ ప్యాక్‌తో అఖిల్ కనిపించబోతున్నాడు. మరోవైపు చిరంజీవి భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ నటిస్తోంది. తమన్నా హీరోయిన్‌గా కనిపించబోతున్నది. భోళా శంకర్ సినిమాను మే 12న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.