గుండె ఆరోగ్యం కోసం ఈ
డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాల్సిందే
By Haritha Chappa Mar 28, 2025
Hindustan Times Telugu
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రం గుండెకు హాని కలిగిస్తాయి.
ముఖ్యంగా గుండెజబ్బుతో బాధపడేవారు కొన్ని డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి.
మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ ను తినడం తగ్గించాలి. అవేంటో ఇక్కడ ఇచ్చాము.
ఖర్జూరాల్లో సహజంగానే చక్కెర అధికంగా ఉంటతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడం., గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎండు ద్రాక్షను కూడా నివారించాలి. ఇది చాలా ఫైబర్ కలిగి ఉన్నప్పటికీ, చక్కెర పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి, గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది.
ఎండిన ఆప్రికాట్ పండ్లలో చక్కెర, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె దెబ్బతింటుంది.
ఎండుద్రాక్షలో చక్కెర అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అంజీర్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి వీటిని మితంగా తినాలి.
ఇవి కాకుండా మిగతా నట్స్, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు చాలా మందికి నోటి ద్వారా గాలి పీల్చే అలవాటు ఉంటుంది.