మీరు చాలా ఉద్వేగభరితంగా ఉన్నారా? చిన్న విషయాలకు కూడా ఏడుస్తుంటారా? అయితే ఇలాంటి వారిని సెన్సిటివ్ లేదా డ్రామా క్వీన్ అంటుంటారు.
pexels
By Bandaru Satyaprasad Jan 02, 2024
Hindustan Times Telugu
భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఒక మార్గం కన్నీళ్లు పెట్టుకోవడం. అదుపు చేయలేని కన్నీళ్లు, చిన్న విషయాలకు సైతం ఎక్కువగా ఏడ్వడం ఓ సమస్యగా చెప్పవచ్చు. అధిక భావోద్వేగాలను నియంత్రించడానికి కొన్ని మార్గాలను పాటించాలి.
pexels
మీ ట్రిగ్గర్లను తెలుసుకోండి- తరుచూ కన్నీళ్లు పెట్టుకోడానికి దారితీసే ట్రిగ్గర్లను గుర్తించి నియంత్రించాలి. అటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.
pexels
లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయండి-మీకు కన్నీళ్లు వస్తున్నట్లు అనిపించినప్పుడు, డీప్ బ్రీత్ తీసుకోండి. కొన్ని సెకన్ల పాటు శ్వాసను అదుపు చేస్తూ లోతునై శ్వాస ప్రాక్టీస్ చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి.
pexels
సానుకూల ఆలోచనలు- ప్రతికూల ఆలోచనలను ఎదుర్కోవడానికి మీ బలాలు, సామర్థ్యాల గుర్తించండి. నిరుత్సాహంగా ఉన్నప్పుడు మీ మైండ్‌సెట్‌ను మార్చడానికి సానుకూల ఆలోచనలు చేయండి.
pexels
బౌండరీస్ సెట్ చేసుకోండి- మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఆరోగ్యకరమైన బౌండరీస్ పెట్టుకోండి. మీ పరిమితులను ఇతరులకు స్పష్టంగా చెప్పండి. అవసరమైనప్పుడు నో చెప్పడానికి భయపడకండి.
pexels
జర్నలింగ్- మీ ఆలోచనలు, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఓ జర్నల్ పెట్టుకోండి. మీ భావాలను రాయడం అనేది భావోద్వేగాలను కంట్రోల్ చేయడానికి చక్కటి చికిత్సా మార్గం.
pexels
ఆరోగ్యకరమైన జీవనశైలి- తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. మంచి పోషకాహారం మీ భావోద్వేగ సవాళ్లను నియంత్రిస్తుంది.
pexels
శారీరక శ్రమ- సహజమైన మానసిక స్థితి కోసం ఎండార్ఫిన్లను విడుదల చేసేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి . వాకింగ్, జాగింగ్ లేదా యోగా సాధన ఇలా ఏదైనా శారీరక శ్రమ మీ మానసిక పరిస్థితికి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
pexels
సపోర్ట్ కోరండి- మీ భావోద్వేగాలను నియంత్రించడం కష్టంగా అనిపిస్తే, మీ భావాల గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వారి మద్దతు తీసుకోండి.
pexels
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.