మీరు కంప్యూటర్ స్క్రీన్ లు, ఇతర గాడ్జెట్ లతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారా? అయితే ఇది నెక్ హంప్ నకు కారణం కావొచ్చు. నెక్ హంప్ వెన్నునొప్పి, తలనొప్పి, విపరీతమైన అలసటకు దారితీస్తుంది. మెడ మూపురం తగ్గించడానికి యోగా సహాయపడవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Nov 03, 2024
Hindustan Times Telugu
స్థితప్రార్థనాసన - నిటారుగా నిలబడి నమస్కారం ముద్రలో ఉండండి. వెన్నెముక నిటారుగా ఉంచి, రెండు చేతులను ఛాతీ వద్ద ఉంచి నమస్కారం చేయండి. కళ్లు మూసుకుని సులభంగా శ్వాస తీసుకోండి.
పద్మాసనం - నేలపై కూర్చొని, మీ పాదాలను రెండు తొడలపై ఉంచండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి. కళ్లు మూసుకోండి. పద్మాసనం చేస్తున్నప్పుడు మీ శ్వాసపై దృష్టి పెట్టండి.
వజ్రాసనం- మోకాళ్లపై కూర్చొని మడమలు పైకి చూపేలా ఆసనం వేయండి. వెన్నెముక నిటారుగా ఉంచండి, భుజాలు సడలించి చేతులను మీ మోకాళ్లపై ఉంచండి. శ్వాసపై దృష్టి పెట్టండి.
మార్జారియాసనం-బిటిలాసన : మోకాళ్ల వంగి చేతులను మ్యాట్ పై ఉంచండి. వీపును కిందకి వంచి తల పైకి ఎత్తి ఆవు భంగిమలోకి వంచండి. వీపును పైకి ఎత్తి తలను కిందకు దించి పిల్లి ఆకారంలో ఆసనం వేయండి.
pexels
సుఖాసన- సుఖాసనంలో నేలపై కూర్చొని మడమలను తొడల కింద ఉంచండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి. మోకాళ్లపై చేతులను ఉంచి విశ్రాంతిగా ఉండండి. కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టిపెట్టండి.
pexels
నటరాజాసన- మీ పాదాలపై నిటారుగా నిలబడి... కుడి కాలును వెనుకకు పైకి వంచి, కుడి చేతితో పట్టుకోండి. ఎడమ చేతిని ముందుకు నిటారుగా ఉంచండి.
ఉష్ట్రాసనం- ఒంటె భంగిమలో మెకాళ్లపై నిలబడి వెనుకకు వంగి రెండు చేతులతో కాళ్లను పట్టుకోండి. కొన్ని సెకన్ల పాటు ఈ ఆసనం వేయండి.
pexels
తలాసనం- మీ పాదాలను సమాంతరంగా ఒక అడుగు దూరంలో ఉంచి నిటారుగా నిలబడండి. చేతులను పైకి లేపి అరచేతులు ఒకదానికొకటి ఎదురుగా సమాంతరంగా ఉంచండి.
చక్రాసనం- చక్రాసనం చేయడానికి యోగా మ్యాట్‌పై పడుకుని మోకాళ్లను వచ్చి, ఆ తర్వాత రెండు చేతులు తలకు ఇరువైపులా ఉంచి మెల్లగా శరీరాన్ని పైకి లేపండి. తల నేలపై పెట్టకుండా విల్లులా శరీరాన్ని వంచండి. ఇలా కొన్ని సెకన్ల పాటు చేయండి.
pexels
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.