ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే పండ్లు తినాలి. అందులో పసుపు రంగులో ఉండే పండ్లు తింటే ఇంకా మంచిది.

Unsplash

By Anand Sai
Mar 12, 2024

Hindustan Times
Telugu

మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి పసుపు రంగులోని పండ్లకు ఉంటుంది. పసుపు మన కళ్లకు అత్యంత ఆహ్లాదకరమైన రంగు. ఇది సూర్యరశ్మి, ఆనందం రంగుగా పరిగణిస్తారు.

Unsplash

పసుపు రంగులోని పండ్లు, కూరగాయలు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మనకు మెరిసే చర్మాన్ని అందిస్తుంది. 

Unsplash

అరటిపండులో శరీర బరువును తగ్గించడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

పైనాపిల్ జీర్ణక్రియకు అద్భుతమైనది, వాపును తగ్గిస్తుంది.

Unsplash

పసుపు క్యాప్సికమ్‌లో ఫైబర్, ఫోలేట్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash

పసుపు రంగు నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది.

Unsplash

పండిన మామిడి కంటిశుక్లం, మచ్చల క్షీణతను నివారించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Unsplash

SRH vs DC: సన్‍రైజర్స్ సృష్టించిన నయా రికార్డులు ఇవే

Photo: AFP