క్యాన్సర్లు ఈ మధ్య పిల్లలనూ వదలడం లేదు. లైఫ్ స్టైల్, వాతావరణ మార్పుల్లాంటివి దీనికి కారణమవుతున్నాయి. మరి పిల్లల్లో వచ్చే ప్రధాన క్యాన్సర్లు ఏవో చూడండి

pexels

By Hari Prasad S
Feb 04, 2025

Hindustan Times
Telugu

ల్యూకేమియా పిల్లల్లో వచ్చే ప్రధాన క్యాన్సర్. ఇవి పిల్లల ఎముక మజ్జ, రక్తంపై ప్రభావం చూపుతుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు చూస్తే కీల్ల నొప్పి, అలసట, రక్తస్రావం, బరువు తగ్గడంలాంటివి.

pexels

బోన్ క్యాన్సర్ కూడా కామనే. ఇది ఏ వయసులో అయినా వచ్చే ప్రమాదం ఉంది. కాళ్లు, చేతుల్లోని ఎముకలు లేదంటే పెల్విక్ లేదా ఊపిరి తిత్తుల గోడల్లో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది

pexels

కిడ్నీ క్యాన్సర్ లేదా విల్మ్స్ ట్యూమర్. సాధారణంగా మూడు, నాలుగేళ్ల పిల్లలపై ఇది దాడి చేస్తుంది. ఇది వచ్చినప్పుడు పొట్టలో ట్యూమర్ లేదంటే వాపు కనిపిస్తుంది.

pexels

మెదడు, వెన్ను క్యాన్సర్లు. ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ఒకటి. ఇది మెదడు కింది భాగంలో మొదలై వెన్నుకు పాకుతుంది. దీనివల్ల వికారం, ఫిట్స్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

pexels

రెండేళ్ల వయసులోనే దాడి చేసే క్యాన్సర్ రెటినోబ్లాస్టోమా. ఇది కంటిపై ప్రభావం చూపుతుంది. కంటి లోపల తెలుపు లేదా గులాబీ రంగు కనిపిస్తుంది.

pexels

న్యూరోబ్లాస్టోమా అంటే నాఢీ కణాలపై ప్రభావం చూపే క్యాన్సర్. చిన్న పిల్లలు, నెలల పిల్లల్లో ఇది కనిపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పొట్టలో ట్యూమర్ ఏర్పడి ఎముకల్లో నొప్పి, జ్వరం వస్తాయి

pexels

రాబ్డోమయోసర్కోమా అంటే కండర కణాల్లో మొదలై శరీరమంతా కనిపించే క్యాన్సర్ ఇది. పొట్ట, తల లేదా మెడలో కనిపించే ప్రమాదం ఉంటుంది. ఇది నొప్పి లేదా వాపు కనిపిస్తుంది.

pexels

గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా లాభాలు

PEXELS