గంటల తరబడి  కూర్చుని పని చేసే ఉద్యోగంలో శరీర బరువు మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. మారే జీవనశైలి, పెరిగే  వయసు ప్రభావంతో జీవన శైలి సమస్యలు చుట్టుముడతాయి. వీటిని ఎలా అధిగమించాలంటే..

By Sarath Chandra.B
May 12, 2025

Hindustan Times
Telugu

వ్యాయామం లేని జీవన శైలితో  థైరాయిడ్, పీసీఓడీ, అధిక రక్తపోటు...వంటి ఆరోగ్య సమస్యలు   బయటప డుతుంటాయి.కండరాలకు కదలికలు కరవైతే వాటి సామర్థ్యం తగ్గు తుంది. 

జీవన శైలిలో వ్యాయామం లేకపోతే  జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయదు. రక్తప్రసరణలో లోపాలు,మహిళల్లో అయితే గర్భాశయ పనితీరులో మార్పులు  మొదలవుతాయి.

ఇంటినీ, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవాలన్నా,మానసిక ఒత్తి డిని అదుపులో ఉంచుకోవడానికి,  రోగాల బారిన పడకుండా ఉండటానికి అన్ని వయసుల వారికి తగిన శారీరక సామ ర్ధ్యం అవసరం. 

పోషకాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వయసుకి తగ్గట్లుగా కసరత్తులు ఎంచుకుంటే ఆరోగ్యంతో పని ఒత్తిడిని కూడా జయించవచ్చు. 

20-30 ఏళ్లలో  మహిళలు శారీరకంగా దృఢంగా ఉంటారు. అందుకు తగ్గట్లే శక్తిని పెంపొందించే వ్యాయామాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా రోజూ కనీసం 30 నిమిషాల జాగింగ్, సైక్లింగ్, డాన్స్, జుంబా వంటి కార్డియో వ్యాయామాలను చేయడం ద్వారా  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

వారంలో 2-3 రోజులు డంబెల్స్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉపయో గించి వెయిట్ లిఫ్టింగ్ వంటివి కండరాల బలాన్ని పెంచు తాయి. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని తగ్గించి, శరీర సౌష్టవాన్ని మెరుగుపరుస్తాయి.

30-40 ఏళ్లలో మహిళల్ని  లైఫ్ స్టైల్ స్ట్రెస్, గర్భం దాల్చడంలో సమస్యలు, హార్మోనుల్లో మార్పులు వంటివి ఎక్కు వగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఇందుకోసం బ్యాలెన్స్డ్ వర్కవుట్లను ఎంచుకోవాలి.  రోజుకి 30-40 నిమిషాలు వేగంగా నడవాలి. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి.  

40-50 ఏళ్ల మధ్య యస్కులు... మోనోపాజ్ సమీపించే ఈ దశలో ఎముకల ఆరోగ్యం, శరీర సౌష్టవం ముఖ్యం.. తక్కువ ఒత్తిడి ఉండే వ్యాయామాలు ఎంచుకోవాలి. స్విమ్మింగ్, ఏరోబిక్స్ లాంటివి ఎంచుకుంటే కీళ్లపై ఒత్తిడి లేకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రోజూ కనీసం  10-15 నిమిషాల స్ట్రెచింగ్ అవసరం. 

50 ఏళ్లకు పైన వయసులో ఆరోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు సాధారణంగా ఎదురవుతాయి. అనారోగ్యాలు దరి చేరకుండా ఉండాలంటే తేలికైన, సురక్షితమైన వ్యాయామాలు ఎంచుకోవాలి. ముఖ్యంగా తామ్చి, యోగా వంటివి శరీ రాన్ని సౌకర్యంగా ఉంచడంతోపాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. 

ఏ వ్యాయామం అయినా 5-10 నిమిషాల వార్సన్ తో మొదలుపెట్టి, కూల్ డౌన్ ముగించాలి. వర్కవుట్లు చేయడంతో పాటు  కాల్షియం, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

వారంలో మూడు రోజులు స్ట్రెంత్ ట్రెయినింగ్ కె, రెండు రోజులు కార్డియో, మరో రెండు రోజులు యోగాకి కేటాయించుకుంటే అన్ని విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. 

కూర్చొని చేసే వ్యాయామాలు కీళ్ల నొప్పులు ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి. వర్కవుట్లు ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా మీ శారీరక స్థితి, అనారోగ్య సమస్యల  గురించి వైద్యుడికి చెప్పాలి. వారి సూచనల మేరకే వ్యాయామాలు చేయాలి.

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు