ఎముకల కోసం 40ల్లోని మహిళలు పాటించాల్సిన 5 జాగ్రత్తలు.. నిర్లక్ష్యం వద్దు!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 06, 2025
Hindustan Times Telugu
40ఏళ్ల వయసు వచ్చిన తర్వాతి నుంచి ఎముకల ఆరోగ్యం విషయంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ వయసులో చాలా మందిలో ఎముకల దృఢత్వం, సాంద్రత తగ్గుతుంటాయి.
Photo: Pexels
అందుకే 40లకు చేరాక ఎముకల దృఢత్వంపై మహిళలు అధిక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ చూడండి.
Photo: Pexels
కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను మహిళల ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం వల్ల ఎముకల బలం, సాంద్రత పెరుగుతాయి. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, సోయా బీన్స్, నట్స్ లాంటి వాటిలో కాల్షియం మెండుగా ఉంటుంది.
Photo: Pexels
40ల వయసులోకి వచ్చాక మహిళలు తప్పనిసరిగా ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఎముకల పరిస్థితి ఎలా ఉందో తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనివల్ల, ఎముకలు డ్యామేజ్ అయ్యే ఆస్టియోపోరోసిస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Photo: Pexels
మహిళలు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ చేయడం మంచిది. వ్యాయామం వల్ల ఎముకల దృఢత్వం మెరుగ్గా ఉంటుంది. దీన్ని విస్మరించకూడదు.
Photo: Pexels
విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. సూర్యరశ్మికి ఉండాలి. కాల్షియంను శోషించుకునేందుకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే, కూరగాయలు, పండ్లు లాంటి పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
Photo: Pexels
శరీరంలో హర్మోన్ల మార్పులు ఎముకలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గితే సాంద్రత తగ్గుతుంది. అందుకే హార్మోన్ల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ.. వైద్యుల సూచనలు పాటిస్తుండాలి.
Photo: Pexels
చలికాలంలో జలుబు వేగంగా తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..