రుచికరమైన ఈ 5 వంటకాలు లేకుంటే హోలీ పండుగ అసంపూర్ణం!

By Sanjiv Kumar
Mar 14, 2025

Hindustan Times
Telugu

హోలీ సంతోషంగా జరుపుకునే రంగుల పండుగ. ఈ పండుగలో మీరు ఈ రుచికరమైన 5 వంటకాలను చేసుకోకుండా హోలీ అసంపూర్ణమే అవుతుంది.  అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

హోలీ రోజున మాల్పువాస్ తయారు చేయడం ద్వారా మీరు మీ పండుగను మరింత స్వీట్‌గా జరుపుకోవచ్చు. ఇది పిండి, పాలు, చక్కెర, సోంపు గింజల మిశ్రమంతో తయారు చేయబడిన తీపి పాన్‌కేక్. దీనిని నెయ్యిలో వేయించాలి.

హోలీ సందర్భంగా చింతపండు, గ్రీన్ చట్నీతో వడ్డించే మృదువైన, లేత, రుచికరమైన పెరుగు వడ చాలామందికి ఇష్టముంటుంది. దీన్ని మీ హోలీ వంటకాల్లో తప్పకుండా చేర్చుకోండి.

గుజియా లేకపోతే హోలీ పండుగ అసంపూర్తిగా కనిపిస్తుంది. పిండి, ఖోయా, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో వేయించి, తరువాత చక్కెర పానకంలో ముంచి లేదా బేకింగ్ చేయడం ద్వారా గుజియాను (తెలంగాణలో కర్జలు) చేసుకోవచ్చు. 

హోలీ రోజున కచోరి, బంగాళాదుంప కూర చేసి హాయిగా తినొచ్చు. ఈ కచోరిని మసాలా బంగాళాదుంప కూరతో తింటారు. దాని రుచి హోలీ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. 

బియ్యాన్ని సన్నగా గ్రైండ్ చేయడం ద్వారా దాని పిండి జిలేబీని పోలిన ఆకారంలో తయారవుతుంది. వాటిని ఎండలో ఎండబెట్టి వేయించుతారు. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఈ రైస్ జిలేబీని నూనెలో తేలికగా వేయించి ఆస్వాదించవచ్చు.

క్లిక్ చేయండి

ఈ 6 చిట్కాలతో ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోండి!

Photo Credit: Pinterest