సాధారణంగా చలికాలంలో చలి అనిపించడం సహజమే. కానీ మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ల కంటే మరీ ఎక్కువగా చలి అనిపిస్తోందా?

pexels

By Hari Prasad S
Nov 29, 2024

Hindustan Times
Telugu

చలి మరీ ఎక్కువగా అనిపించడానికి ఆరు కారణాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

pexels

శరీరంలో ఐరన్ లోపం ఉంటే అది రక్తంలో ఆక్సిజన్ సరఫరాపై ప్రభావం చూపుతుంది. ఇది మీకు చలి ఎక్కువగా అనిపించేలా చేస్తుంది

pexels

శరీరంలో విటమిన్ బీ12 లోపం ఉన్నా కూడా రక్త ప్రసరణ సరిగా జరగక చలి ఎక్కువగా అనిపిస్తుంది

pexels

రక్త ప్రసరణ సరిగా జరగకపోయినా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇది కూడా చలి ఎక్కువగా అనిపించడానికి ఒక కారణం.

pexels

ఫొలేట్ లేదా విటమిన్ బీ9 తక్కువగా ఉండటం వల్ల కూడా చలి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది

pexels

నీళ్లు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురై శరీర ఉష్ణోగ్రతను వేగంగా కోల్పోవడం వల్ల చలి ఎక్కువగా అనిపిస్తుంది

pexels

శరీరంలో విటమిన్ సి లోపం ఉన్నా కూడా మిగిలిన వాళ్లతో పోలిస్తే చలి ఎక్కువగా అనిపిస్తుంది

pexels

చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియ తరచుగా దెబ్బతింటుంది. ఊరగాయల వంటి పచ్చళ్లు చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శీతాకాలంలో పచ్చళ్లు తినడానికి 9 కారణాలు తెలుసుకుందాం.  

pexels