చలికాలంలో పొడి వాతావరణం కారణంగా చర్మం తేమను కోల్పోతుంది. దీంతో కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి. శీతాకాలంలో చాలా మంది మడమల పగుళ్లు, కాళ్ల పగుళ్ల సమస్యలు ఎదుర్కొంటారు.
twitter
By Bandaru Satyaprasad Nov 23, 2024
Hindustan Times Telugu
కాళ్ల పగుళ్ల వల్ల నొప్పి, చికాకు, కొన్నిసార్లు రక్తస్రావం కలిగిస్తాయి. ఈ సమస్యను అరికట్టడానికి, పగిలిన మడమలచికిత్సకు, మృదువైన మడమలను తిరిగి పొందడానికి ఐదు సులభమైన ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.
twitter
ఎక్స్ఫోలియేషన్ - ఎక్స్‌ఫోలియేషన్ పాదాల చర్మం నుంచి చనిపోయిన చర్మం, కణాలను క్లియర్ చేస్తుంది. 20 నిమిషాల వరకు గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచండి. పగిలిన గట్టి చర్మాన్ని తొలగించడానికి లూఫా, ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్బర్ ఉపయోగించండి.
pexels
కొబ్బరి నూనె- కొబ్బరి నూనె చర్మం తేమను నిలుపుకోవడంలో సాయపడుతుంది. గోరువెచ్చిని నీటిలో మడమలను కాసేపు నానబెట్టి అనంతరం కొబ్బరి నూనెను అప్లై చేయవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.
pexels
తేనె- పగిలిన మడమల చికిత్సకు తేనె హోం రెమెడీగా పనిచేస్తుంది. తేనెలోని యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాన్ని నయం చేస్తాయి. ఎక్స్‌ఫోలియేషన్ తర్వాత తేనెను అప్లై చేయవచ్చు.
pexels
వెనిగర్- వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి పగిలిన పాదాలకు కాసేపు నీటిలో ఉంచండి. వెనిగర్ ఆమ్ల స్వభావం పొడి బారిన చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఎక్స్‌ఫోలియేషన్‌కు ఇది సులభమైన ఎంపిక.
pexels
మామిడి చెట్టు నుంచి వచ్చే రెసిన్ గమ్ క్రాక్డ్ హీల్స్ ను చికిత్స చేస్తుంది. స్నానం చేసిన తర్వాత రోజుకు రెండుసార్లు ఈ గమ్‌ని కాళ్ల పగుళ్ల భాగంలో పూయండి.
గంజి, పసుపు చిట్కా- అన్నం వండిన తర్వాత మిగిలిన గంజిలో కొద్దిగా గోరువెచ్చిని నీటిని కలిపి, అందులో కాస్త పసుపు వేయండి. ఈ మిశ్రమంలో పాదాలు మునిగేలా కాసేపు ఉంచండి. అనంతరం కొబ్బరి నూనె లేదా ఏదైనా లోషన్ పగిలిన పాదాలకు అప్లై చేయండి.
టీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.