చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి.
pexels
By Bandaru Satyaprasad Dec 07, 2024
Hindustan Times Telugu
వైరల్ ఇన్ఫెక్షన్లు దాదాపు 90 శాతం గొంతు నొప్పికి కారణమవుతాయి. పొడి గాలిని పీల్చడం వల్ల గొంతులోని తేమను పీల్చుకుంటుంది. దీంతో గొంతులో అసౌకర్యం ఏర్పడుతుంది.
pexels
ఈ 7 ఇంటి చిట్కాలలో చలికాలంలో గొంతు నొప్పిని నివారించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
pexels
బోన్ సూప్ తో కాల్షియం, జింక్, మెగ్నీషియం పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
pexels
వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్. గొంతు నొప్పిని తగ్గించడానికి తాజా వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి నమలండి లేదా వేడి నీటిలో తేనె, మెత్తగా తరిగిన వెల్లుల్లిని కలుపుకుని తాగాలి.
pexels
పొడి గాలి ఎక్కువగా ఉంటే హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి.
pexels
దాల్చినచెక్క, జాజికాయ లేదా అల్లం వంటి మసాలా దినుసులతో నీరు, తేనె, నిమ్మరసంతో చేసిన వేడి నీరు గొంతులో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
pexels
కాలుష్య కారకాల నుంచి శరీరాన్ని రక్షించుకునేందుకు మాస్క్ ధరించండి.
pexels
హైడ్రేటెడ్ - తరచూ నీళ్లు తాగడం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, చేతులు కడుక్కోవడం, ఇండోర్ ప్రదేశాలలో తేమ వాతావరణం ఉండేలా చూసుకోవడం చేస్తే గొంతు నొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు.
pexels
బేకింగ్ సోడా నీటిని పుక్కిలించడం వల్ల నోటిలోని యాసిడ్‌లను తటస్థీకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేసే 5 రకాల ఫుడ్స్