చలికాలంలో మీ చర్మం పొడిగా, నిస్తేజంగా అనిపించవచ్చు. అయితే ఈ 7 ఆహారాలు మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. చలికాలంలో మీ చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
pexels
By Bandaru Satyaprasad Jan 16, 2025
Hindustan Times Telugu
స్వీట్ పొటాటోస్ - చిలగడదుంపలోని బీటా కెరోటిన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, సహజమైన మెరుపును ప్రోత్సహిస్తుంది.
pexels
బెర్రీలు - బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. మీ చర్మాన్ని మెరిసేలా, హైడ్రేటెడ్ గా, దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.
pexels
బాదం - విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదంపప్పులు చర్మంలోని తేమను కాపాడతాయి. చర్మంపై ముడతలు, గీతలు తగ్గించడంలో సహాయపడతాయి. బాదంపప్పులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం హైడ్రేషన్ పెరుగుతుంది.
pexels
ఆకు కూరలు- బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకుకూరల్లో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.
pexels
బ్రోకలీ - బ్రోకలీ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి పవర్ హౌస్ లు. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్తత్పిని పెంచుతుంది. ఇది చర్మాన్ని దృఢంగా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మ కాంతిని ప్రోత్సహిస్తుంది.
pexels
క్యారెట్లు - బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే క్యారెట్లు చర్మ ఆకృతిని, టోన్ ని మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇవి చర్మ పునరుద్ధరణకు, మృదు స్వభావానికి సహాయపడతాయి.
pexels
బేరి - బేరి పండులో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుంది.
pexels
సొరియాసిస్‌ను గుర్తించడం ఎలా..లక్షణాలు ఎలా ఉంటాయి...