సీతాఫలంలో తక్కువ కేలరీలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చలికాలంలో సీతాఫలం తినడానికి 12 కారణాలున్నాయి.
pexels
By Bandaru Satyaprasad Dec 09, 2024
Hindustan Times Telugu
తక్కువ కేలరీలు - శీతాకాలంలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఈ ఆహారంలో సీతాఫలం చేర్చుకోండి. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండే తేలికపాటి చిరుతిండి.
pexels
పుష్కలంగా ఫైబర్ - సీతాఫలంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
pexels
యాంటీ ఆక్సిడెంట్లు - సీతాఫలంలో విటమిన్ సి, కెరొటినైడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. వృద్ధాప్యాన్ని నమ్మెదిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
pexels
రోగ నిరోధక శక్తికి సపోర్ట్ - శీతాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. సీజనల్ వ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది.
pexels
కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది - సీతాఫలంలోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వయస్సు సంబంధిత మచ్చలను తగ్గిస్తుంది.
pexels
చర్మాన్ని మెరుగుపరుస్తుంది - సీతాఫలంలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ముడతలను తగ్గించి, యవ్వవమైన మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
pexels
అధిక రక్తపోటును నివారిస్తుంది - సీతాఫలంలోని పొటాషియం సోడియం ప్రభావాలను బ్యాలెన్స్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది.
pexels
షుగల్ లెవల్స్ కంట్రోల్ - సీతాఫలంలో తీపి ఉన్నప్పటికీ...ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. షుగల్ పేషెంట్స్ దీనిని మితంగా తినవచ్చు.
pexels
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది - సీతాఫలంలోని ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
pexels
ఇన్ ఫ్లమేషన్ తో పోరాడుతుంది - సీతాఫలంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులున్న వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.