కర్బూజ రుచికరమైనవి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మీ ఆహారంలో కర్బూజ చేర్చుకోవడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jan 28, 2025
Hindustan Times Telugu
హైడ్రేటెడ్ గా ఉంచుతుంది - దాదాపు 90 శాతం వాటర్ కంటెంట్ తో ఉండే కర్బూజ పండ్లు మిమ్మల్ని హైడ్రేట్ గాఉంచడంలో సహాయపడతాయి. డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్న చల్లని వాతావరణంలో కర్బూజ ఉపయోగకరంగా ఉంటుంది.
pexels
కంటి ఆరోగ్యం - కర్బూజలోని బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. వయోసంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
pexels
మధుమేహం నిర్వహణ -కర్బూజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఇవి మంచి ఎంపిక.
pexels
బరువు తగ్గడంలో- తక్కువ కేలరీలు, నీరు, ఫైబర్ అధికంగా ఉండే కర్బూజ బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప చిరుతిండి. ఇది మీ కడుపు నిండుగా చేసి, అతిగా తినడం తగ్గించడంలో సాయపడుతుంది.
pexels
రోగ నిరోధక వ్యవస్థ - కర్బూజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మీ శరీరం ఇన్ఫెక్షన్ల, అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది.
pexels
ఒత్తిడితో పోరాడుతుంది - కర్బూజలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను నిర్వహించడానికి సహాయపడుతుంది.
pexels
బీపీ కంట్రోల్ - పొటాషియం, పీచు, నీరు సమృద్ధిగా ఉండే కర్బూజ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
pexels
మలబద్దకం నుంచి ఉపశమనం - కర్బూజలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగుల్లో ఆహారం కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
pexels
ఆరోగ్యకరమైన చర్మం - విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన కర్బూజ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మపు రంగును ప్రోత్సహిస్తుంది.
pexels
కిడ్నీ స్టోన్స్ నివారణ - కర్బూజ వాటర్ రిచ్ ఫ్రూట్. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.