చలికాలంలో వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు సర్వసాధారణం. శీతాకాలంలో కఫం, దగ్గు సమస్య కొందరిలో అధికంగా ఉంటుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ఈ 7 ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి.
pexels
By Bandaru Satyaprasad Dec 01, 2024
Hindustan Times Telugu
సాధారణ జలుబు, దగ్గు హానికరం కానప్పటికీ చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి కఫం వంటి తీవ్రమైన సమస్యలుగా మారే అవకాశం ఉంది. కొన్ని సింపుల్ హోం రెమెడీస్ తో కఫం తగ్గించుకోవచ్చు.
pexels
నాసల్ స్ప్రే- కఫం తగ్గించడానికి, జలుబు సమస్యను ఎదుర్కోవడానికి నాసల్ స్ప్రే లేదా డ్రాప్స్ ప్రయత్నించవచ్చు. నాసల్ స్ప్రేలో ఉప్పునీరు ఉంటుంది. ఇది కఫం తేలికపడడానికి సహాయపడుతుంది.
pexels
నీరు ఎక్కువగా తాగాలి- చలికాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల అదనపు కఫం పేరుకుపోవడానికి ఒక కారణం అవుతుంది. డీహైడ్రేషన్ శ్లేష్మం మందంగా మారి ఇబ్బందులు తలెత్తుతాయి. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కఫం తగ్గుతుంది.
pexels
ఉప్పు నీటితో పుక్కిలించండి- ఉప్పు నీటితో పుక్కిలించడం మీ గొంతును శుభ్రపరచడానికి, కఫం తగ్గడానికి సహాయపడుతుంది. ఓ గ్లాసు వేడి నీటిలో 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపండి. ఈ నీటిని తాగి కొన్ని సెకన్ల పాటు గొంతులో ఉంచి పుక్కిలించండి. పగటిపూట ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఇలా చేయండి.
pexels
దగ్గు తగ్గడానికి తేనె అల్లం- ఒక టేబుల్ స్ఫూన్ తేనెను ఒక టీ స్పూన్ అల్లం రసంతో కలిపి తాగండి. ఈ మిశ్రమం గొంతు నొప్పి, పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే గొంతు నొప్పి, దగ్గును తగ్గిస్తుంది.
హెర్బల్ టీ- హెర్బల్ టీతో కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్స్‌పెక్టరెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి శ్వాసకోశ మార్గాలను శుభ్రపరచడానికి సాయపడతాయి.
pexels
ఆవిరి - కఫం తగ్గించుకోవడానికి వేడి నీటి ఆవిరిని పీల్చుకోండి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశంలో శ్లేష్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. ఈ నీటిలో కొన్ని ఔషధ నూనెలను జోడించడం వలన మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
pexels
ఇన్ఫెక్షన్ రాకుండా పౌష్టికాహారం- కఫం సమస్యలున్న వారు ఆహారంపై శ్రద్ధ వహించాలి. కఫం వదిలించుకోవడానికి, ఎక్కువగా ఏలకులు, ఉల్లిపాయలు, పైనాపిల్, అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఆహారంలో జోడించండి. కారంగా ఉండే ఆహారాలు, అధిక మిరప మోతాదులు సహజమైన డీకాంగెస్టెంట్‌లుగా పనిచేస్తాయి. ఇవి కఫం తొలగించడాన్ని సులభతరం చేస్తుంది.
pexels
చలికాలంలో శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రింక్స్ తాగండి..