చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్ తో బాధపడుతుంటే కీళ్ల నొప్పుల తీవ్రత పెరుగుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఈ 8 చిట్కాలు ఫాలో అవ్వండి.
pexels
By Bandaru Satyaprasad Dec 28, 2024
Hindustan Times Telugu
చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు కీళ్ల నొప్పులను మరింత తీవ్రతరం చేస్తాయి. వెచ్చని దుస్తులు,గ్లోవ్స్, సాక్స్ ధరించి మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోండి. బయటకు వెళ్లేటప్పుడు జాకెట్లను ఉపయోగించుకోండి.
pexels
హాట్ ప్యాక్ తో జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్త ప్రవాహాన్ని పెంచడానికి, కండరాల విశ్రాంతికి హాట్ ప్యాక్ ఉపయోగపడుతుంది. జాయింట్ పెయిన్స్ తక్షణ ఉపశమనం కోసం హాట్ ప్యాక్ లేదా వెచ్చని టవల్ ఉపయోగించండి.
pexels
మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోండి. నడక, యోగా, సున్నితమైన వ్యాయామాలను ప్రయత్నించండి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం చలికాలంలో కాస్త యాక్టివ్ ఉండండి.
pexels
మీ ఆహారంలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ డి, కాల్షియం తగినంతగా ఉండేలా చూసుకోండి. డెయిరీ, ఆకు కూరలు, తృణ ధాన్యాలు మీ ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి.
pexels
మీ ఆహారంలో చేపలు, గింజలు, అల్లం, బెర్రీల వంటి ఆహారాలను చేర్చండి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడే ఈ యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోండి.
pexels
కీళ్లను మసాజ్ చేయండి - మీ కీళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నొప్పిని తగ్గించవచ్చు. కీళ్ల ఉపశమనానికి ముఖ్యమైన నూనెలు, క్రీమ్ లను ఉపయోగించవచ్చు.
pexels
చలికాలంలో శరీరం డీహైడ్రేట్ అవుతుంటుంది. దీంతో కండరాలు బిగుసుకపోతాయి. మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా, కీళ్లను లూబ్రికేట్ గా ఉంచేందుకు నీరు పుష్కలంగా తాగాలి.
pexels
ఓవర్ ది కౌంటర్ మందులు - వైద్యుల సూచనలతో ఓవర్ ది కౌంటర్ మెడిసన్ ఐబుప్రొఫెన్, ఆసిటమినోఫెన్ వంటి వాటితో జాయింట్ పెయిన్స్ నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
pexels
నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.