చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్ డి లోపం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఈ 9 విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తో చలికాలంలో విటమిన్ డి లోపాన్ని అధికమించవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Jan 12, 2025
Hindustan Times Telugu
గుడ్లు - గుడ్లు ముఖ్యంగా పచ్చసొన విటమిన్ డి కి గొప్పమూలం. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
pexels
ఫోర్టిఫైడ్ ఫుడ్స్ - తృణధాన్యాలు, సోయా, బాదం, వాల్ నట్స్, నారింజ రసం వంటి అనేక మొక్కల ఆధారిత ఆహారాల్లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది.
pexels
చీజ్ - చీజ్ విటమిన్ డిని కలిగి ఉంటుంది. మీ భోజనంలో చీజ్ ను చేర్చుకోవడం వలన విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
pexels
డేట్స్ - ఖర్జూరాలు వివిధ విటమిన్లు, మినరల్స్ కు సహజ మూలం. ఇందులో విటమిన్ డి ఉంటుంది. చలికాలంలో మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చడం ద్వారా అదనపు పోషకాహారం లభిస్తుంది.
pexels
ఫ్యాటీ ఫిష్- సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి ఫ్యాటీ ఫిష్ విటమిన్ డికి బెస్ట్ సోర్స్. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ డి ఉంటుంది. మీ ఆరోగ్యానికి రెండింతలు ప్రయోజనం సమకూరుస్తుంది.
pexels
డ్రై ఫ్రూట్స్ - బాదం, వాల్ నట్స్, ఇతర డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ డి ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లను అందిస్తాయి.
pexels
పాలు - పాలు బలవర్థకమైన ఆహారం, అలాగే విటమిన్ డి కి అద్భుత మూలం. అనేక పాల బ్రాండ్లు తమ ఉత్పత్తులకు విటమిన్ డిని జోడిస్తాయి.
pexels
పుట్టగొడుగులు - షిటేక్, మైటేక్ వంటి కొన్ని రకాల పుట్టగొడుగులు సహజంగా విటమిన్ డిని కలిగి ఉంటాయి. చలికాలంలో పుట్టగొడుగులు విటమిన్ డికి మంచి ఆహారం.
pexels
పెరుగు - పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటమే కాకుండా విటమిన్ డి కూడా ఉంటుంది. రోజు ఒక గిన్నె పెరుగును స్మూతీస్ గా ఆస్వాదించడం వల్ల విటమిన్ డి స్థాయిలను పెంచుకోవచ్చు.
pexels
అల్లంతో అద్భుత ప్రయోజనాలు.. అజీర్ణ వ్యాధులకు అద్భుతమైన ఔషధం