చలికాలంలో గ్లాస్ స్కిన్ కోసం 6 కొరియన్ చర్మ సంరక్షణ చిట్కాలు
pexels
By Bandaru Satyaprasad Dec 25, 2024
Hindustan Times Telugu
స్కిన్ కేర్ లో కొరియన్ పద్దతులు ట్రెండ్ సెట్ చేశాయి. కొరియన్ చర్మ సంరక్షణ పద్దతులు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. చలికాలంలో కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం సమర్థవంతమైన చర్మ సంరక్షణ చిట్కాలు తెలుసుకుందాం.
pexels
డబుల్ క్లెన్సింగ్- కొరియన్లు శీతాకాలంలో గ్లాస్ స్కిన్ పొందేందుకు డబుల్ క్లెన్సింగ్ టెక్నిక్ పాటిస్తారు. ఈ స్కిన్‌కేర్ చిట్కాలో మేకప్, మలినాలను తొలగించడానికి మైకెల్లార్ వాటర్‌ని ఉపయోగిస్తారు. చర్మ సంరక్షణకు హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజింగ్ క్లెన్సర్ ఉపయోగిస్తారు.
pexels
సన్‌స్క్రీన్‌ను మర్చిపోవద్దు- చలికాలంలో సూర్య కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. UVA కిరణాల వల్ల అకాల వృద్ధాప్యం, నల్ల మచ్చలు, పొడిబారడానికి కారణం అవుతాయి. చర్మ సంరక్షణకు ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి.
pexels
ఎక్స్‌ఫోలియేట్- చర్మానికి ఎక్స్‌ఫోలియేషన్ కీలకం ఎందుకంటే ఇది డెత్ స్కిన్ ను తొలగించి కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. కొరియన్ స్కిన్ కేర్ టిప్స్ లో బియ్యం పిండి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్. దీంతో చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.
pexels
సీరం -సీరమ్‌లు కొరియన్ చర్మ సంరక్షణ పద్దతుల్లో కీలకం. శీతాకాలంలో అవి చాలా ముఖ్యమైనవి. చర్మ పొడి బారడాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. చర్మంలో తేమను లాక్ చేసి ప్రకాశవంతం చేయడానికి సీరమ్‌ను అప్లై చేయండి.
pexels
ఆవిరి పట్టండి - చలికాలంలో ఆవిరి పట్టడం వల్ల చర్మం పునరుజ్జీవనం అవుతుంది. ఆవిరి చర్మ రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. చర్మంలో చిక్కుకున్న మురికి, మలినాలను లోతుగా శుభ్రపరచడానికి ఆవిరి అనుమతిస్తుంది. రెగ్యులర్ స్టీమ్ సెషన్స్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
pexels
షీట్ మాస్క్-కొరియన్లు తమ చర్మ సంరక్షణకు ముఖ్యంగా షీట్ మాస్క్‌లను ఉపయోగిస్తారు. షీట్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల హైడ్రేషన్ తగిన మోతాదులో అందిస్తుంది. చలికాలంలో షీట్ మాస్క్‌లను తరచు ధరించడం వల్ల స్కిన్ లో తేమను లాక్ చేస్తుంది. దురద, చికాకును తగ్గించవచ్చు.
pexels
యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్‍తో బరువు వేగంగా తగ్గొచ్చా?