తెలుగు వారికి అన్నం తింటేనే భోెజనం చేసినట్టు. అన్నంతో చేసిన వంటకాలు తినకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది.
అయితే బరువు పెరుగుతారనే భయంతో చాలా మంది అన్నం తినడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట తినడం వల్ల బరువు పెరుగుతామే భయం ఎక్కువమందిలో ఉంది.
రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతామన్నది నిజమా లేక అపోహ?
రాత్రిపూట అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అయితే, సమతుల్య ఆహారంలో భాగంగా మితంగ అన్నం తినడం వల్ల బరువు పెరగరు.
అన్నంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
అన్నం తేలికగా జీర్ణమవుతుంది. ఈ సందర్భంలో, నిద్రపోవడానికి 2-3 గంటల ముందు రాత్రి భోజనం ముగించండి. ఆ తర్వాత కొద్దిసేపు నడవాలి. అలా అయితే బరువు పెరిగే అవకాశం ఉండదు.
కానీ గుర్తుంచుకోండి,
రాత్రిపూట అన్నం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
రాత్రిపూట కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాలు తినడం వల్ల పొట్ట వాపు వస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి.
క్లిక్ చేయండి
గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.