పిస్తాలు పోషకాలతో నిండి ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం వీటిని తీసుకోవటం వల్ల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
image credit to unsplash
ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ సమయంలో కొన్ని పిస్తాలను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా గుండె ఆరోగ్యం కాపాడడం దగ్గర నుంచి బరువు తగ్గించడం వరకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.
image credit to unsplash
పిస్తాలు పేగుల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని పీచు బ్యూటీరేట్ వంటి కొవ్వు ఆమ్లాలుగా మారుతుంది. ఇది పెద్దపేగులోని కణాలకు మంచి శక్తిని ఇస్తుంది.
image credit to unsplash
డయాబెటిస్ ఉన్నవారికి పిస్తాతో మేలు జరుగుతుంది. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. అయితే మరీ ఎక్కువ తినకపోవటం మంచిది.
image credit to unsplash
పిస్తాను తినడం వల్ల శరీరంలోని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాలు సంకోచించకుండా విస్తరించడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల రక్తప్రసారం శరీరానికి సవ్యంగా జరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది.
image credit to unsplash
పిస్తాల్లో పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిచటంలో సహాయపడుతుంది.
image credit to unsplash
పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.
image credit to unsplash
క్యాబ్‌లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్‌ని మర్చిపోకండి!