హెల్త్ కార్డు ఎందుకు ఉండాలి...! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 18, 2025

Hindustan Times
Telugu

ప్రస్తుత రోజుల్లో వైద్యం ఎంతో ఖరీదైనది. అనారోగ్య సమస్యతో ఆస్పత్రి మెట్లు ఎక్కితే చాలు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. 

image credit to unsplash

వైద్యానికి అధిక ఖర్చులు అవుతున్న నేపథ్యంలో ఈ భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్డును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

image credit to unsplash

ఆరోగ్య బీమా కార్డు ఎవరైనా తీసుకోవచ్చు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా  ఈ కార్డును తీసుకోవచ్చు. అయితే ఎలాంటి కార్డు తీసుకోవాలనే విషయంలో ముందుగానే ఓ అంచనా ఉండాలి.

image credit to unsplash

ప్రస్తుతం ఎన్నో రకాల గ్రూప్ ఆఫ్ కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇందుకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీ వయసుకు అనుగుణంగా ఈ ఛార్జీలు ఉంటాయి.

image credit to unsplash

హెల్త్ కార్డు ఉంటే వైద్య చికిత్స విషయంలో ధీమాగా ఉండొచ్చు. పాలసీదారు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. 

image credit to unsplash

మీరు తీసుకునే హెల్త్ కార్డు ఆధారంగా సంబంధిత నెట్ వర్క్ ఆస్పత్రులను తెలుసుకోవచ్చు. ఇందులో చిన్నస్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు హాస్పిటల్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆస్పత్రిలో వైద్య సేవలు పొందవచ్చు.

image credit to unsplash

 పాలసీదారుడు నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్యాకేజీని ఎంచుకోవచ్చు. పలు బీమా సంస్థలు అనేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచుతాయి. కొన్ని సంస్థలు ఈఎంఐ ద్వారా కూడా డబ్బులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

image credit to unsplash

చియా విత్తనాలు చూడటానికి చిన్నవిగా ఉండవచ్చు. కానీ వాటికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash