వేసవిలో జుట్టుకు నూనె రాసుకోవడం లేదా! ఈ విషయాలు తెలుసుకోండి
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Mar 18, 2025
Hindustan Times Telugu
ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే వేసవిలో జుట్టుకు కూడా సవాళ్లు ఎదురవుతాయి. వెంట్రుకలు పొడిబారడం సహా మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. జుట్టు రాలడం కూడా కొందరిలో పెరుగుతుంది.
Photo: Pexels
వేసవిలో జుట్టుకు ఎదురయ్యే సమస్యలను నూనెలు తగ్గించగలవు. కొబ్బరినూనె, బాదంనూనె, ఆలివ్‍నూనె లాంటివి ఎండాకాలంలో జుట్టుకు మేలు చేస్తాయి. లాభాలు ఏంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
వేసవిలో ఉండే వేడి వల్ల జుట్టులోని తేమ ఆరిపోయి పొడిగా మారిపోతుంది. ఇలా కాకుండా జుట్టులో హైడ్రేషన్ మెరుగ్గా ఉండాలంటే నూనె రాసుకోవాలి. వెంట్రుకల్లో తేమను నూనె సంరక్షిస్తుంది.
Photo: Pexels
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (యూవీ) కిరణాల వల్ల జుట్టు డ్యామేజ్ అవడాన్నినూనెలు తగ్గిస్తాయి. నూనె రాసుకుంటే జుట్టు రంగు పాలిపోకుండా, పొడిబారకుండా, రాలకుండా తోడ్పడతాయి.
Photo: Pexels
వేసవిలో స్కాల్ప్ (కుదుళ్లు) కూడా పొడిగా అవుతుంటుంది. దీనివల్ల చుండ్రు పెరుగుతుంది. నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్ తేమగా ఉండి.. చండ్రు అదుపులో ఉంటుంది.
Photo: Pexels
వేసవిలో ఎదురయ్యే మరో సమస్య జుట్టు ఎక్కువగా చిక్కులు పడడం. అయితే, వెంట్రుకలకు నూనె రాయడం వల్ల చిక్కులు పడడం తగ్గుతుంది. కాలుష్యం నుంచి కూడా రక్షణ దక్కుతుంది.
Photo: Pexels
జుట్టుకు నూనె రాయడం వల్ల టెక్స్చర్ మెరుగ్గా ఉంటుంది. మెరుపు బాగుంటుంది. జుట్టు రాలడం, చిట్లడం తగ్గుతుంది.
Photo: Pexels
గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు