బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎందుకు తినాలంటే..

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 18, 2024

Hindustan Times
Telugu

బీటా కెరోటిన్‍.. కూరగాయల రంగును పెంచుతుంది. ఈ బీటా కెరోటిన్ ఉన్న ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Pexels

ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లు, చిలకడ దంపలు, టమాటోలు, బ్రకోలీ, పాలకూర, క్యాప్సికం సహా మరిన్ని కూరగాయల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. 

Photo: Pexels

బీటా కెరోటిన్ ఉన్న ఆహారాలు తినడం వల్ల మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుంది. జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి పెరిగేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల కాలేయానికి మేలు జరుగుతుంది. కాలేయ పని తీరును మెరుగుపచటంతో పాటు క్యాన్సర్ రిస్కును ఇది తగ్గించగలదు. బీటా కెరోటిన్‍ను శరీరం విటమిన్-ఏగా మార్చుకుంటుంది.  

Photo: Pexels

బీటా కెరోటిన్ ఉండే ఆహారాలు తినడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. కంటి చూపునకు మేలు చేస్తాయి. వయసు రీత్యా కంటిచూపు తగ్గే సమస్య తగ్గడంలోనూ తోడ్పడతాయి. 

Photo: Pexels

చర్మానికి కూడా బీటా కెరోటిన్ మంచి చేస్తుంది. ముఖ్యంగా యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడడంలో సహకరిస్తుంది. చర్మం మెరుపును పెంచుతుంది. 

Photo: Pexels

అధిక మంట కోసం గ్యాస్ బర్నర్ ను ఎలా శుభ్రం చేసుకోవాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి   

twitter