వేసవిలో మామిడి పండ్లు పండడం ప్రారంభిస్తే.. వర్షాకాలంలో కూడా అవి మార్కెట్లో లభిస్తాయి.
Unsplash
By Anand Sai Jun 30, 2025
Hindustan Times Telugu
వేసవిలో మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ వర్షాకాలంలో మామిడి ఆరోగ్యానికి హానికరం.
Unsplash
వర్షాకాలంలో తేమ, వర్షం కారణంగా మామిడి తొక్కలపై బూజు, బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల మామిడి ఇన్ఫెక్షన్ కు గురవుతుంది.
Unsplash
వర్షాకాలంలో పిల్లలకు మామిడి పండ్లు ఎక్కువ ప్రమాదకరం. పిల్లల చర్మం, కడుపు సమస్యలు ఎక్కువగా వస్తాయి.
Unsplash
వర్షాకాలంలో మామిడి పండ్లు త్వరగా పులియబెట్టుకుంటాయి. ఈ సీజన్‌లో మామిడి బయటి నుండి చూడటానికి బాగా కనిపిస్తుంది. కానీ తింటే జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
Unsplash
వర్షాకాలంలో మామిడి పండ్లు తినడం వల్ల చర్మ అలెర్జీ సమస్యలు వస్తాయి. చాలా మందికి ఇప్పటికే మామిడి పండ్లతో అలెర్జీలు, దద్దుర్లు, మొటిమల సమస్యలు ఉన్నాయి.
Unsplash
వర్షాకాలంలో మామిడి పండ్లను తినకుండా ఉండటం బెస్ట్. ఎక్కువగా పండిన లేదా కోసి దాచిపెట్టిన మామిడి పండ్లను తినకూడదు.
Unsplash
వర్షాకాలంలో మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచే బదులు, వాటిని పొడి ప్రదేశంలో ఉంచాలి. కడుపు లేదా అలెర్జీ సమస్యలు ఉంటే వర్షాకాలంలో మామిడి పండ్లను తినకపోవడమే మంచిది.