మునగ చెట్టును...చెట్టు రూపంలో ఉన్న దేవతా మూర్తి  అని ఎందుకు అంటారంటే...

By Sarath Chandra.B
Mar 26, 2025

Hindustan Times
Telugu

మునగచెట్టును వృక్ష శాస్త్రంలో Moringa Oleifera అంటారు. 

మునగ చెట్టును ట్రీ ఆఫ్‌ లైఫ్‌, మిరకిల్ మొరింగా, మదర్స్‌ బెస్ట్‌ ఫ్రెండ్, నెబిడాయే వంటి పేర్లతో కూడా పిలుస్తారు. 

ఆఫ్రికన్ భాషలో నెబిడాయే అంటే  మృత్యువు లేనిదని అర్థం...

ఒకసారి నాటిన తర్వాత మునగ చెట్టు కాండాన్ని ఎన్ని సార్లు నరికినా తిరిగి పెరుగుతూనే ఉంటుంది. 

మునగ చెట్టు ఆకులను, పూతను, కాయలను తినేవారు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో చిరకాలం జీవిస్తారు. 

మునగచెట్టు  ఉత్తర భారత దేశం నుంచి పాకిస్తాన్,  బంగ్లాదేశ్‌, ఆఫ్ఘినిస్తాన్‌లకు వ్యాపించినట్టు చెబుతారు.  ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో మునగ చెట్టును అధికంా సాగు చేస్తున్నారు. 

ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఐదువేల సంవత్సరాలుగా 300రకాల వ్యాధులకు మునగాకును ఔషధంగా వినియోగిస్తున్నారు. 

మునగాకులో ఉండే పోషక విలువలు సూపర్‌ ఫుడ్‌గా పరిగణిస్తారు. శరీరానికి కావాల్సిన మాంసకృతులు,  కొవ్వు పదార్ధాలు, పిండి, పీచు పదార్ధాలు మెండుగా ఉంటాయి. 

మునగలో కాల్షియం,  మెగ్నిషియం, పొటాషియం,  ఐరన్, కాపర్‌, ఫాస్పరస్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. 

మునగాకులో విటమిన్ ఏ, బి1, బి2, బి3, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. 

శరీరంలో జీవకణాలు, కండరాల  నిర్మాణానికి అవసరమైన ఆర్జినైన్‌, హిస్టినైన్, విసైన్, ట్రిఫ్టోఫాన్, ఫెనిలానివైన్, మెధియోనైన్, థ్రియోనైన్, ల్యూనైన్, సొల్యూసైన్ వంటి 19 యామినో యాసిడ్స్‌ ఉంటాయి. 

మనిషి ఆరోగ్య పరిరక్షణకు 40రకాల పోషక పదార్ధాలు అవసరం అయితే మునగాకులో ఏకంగా 92 రకాల పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని కల్పవృక్షంగా భావిస్తారు. 

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త