బహ్య సౌందర్యానికి కేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి..
By Bolleddu Sarath Chandra Jan 09, 2025
Hindustan Times Telugu
జంతువులకు ఒళ్లంతా వెంట్రుకలు ఉన్నా, మనుషులకు కేవలం తల భాగంలో మాత్రమే జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. వెంట్రుకలు దట్టంగా ఉండే భాగంలో చెమట గ్రంథులు ఎక్కువగా ఉంటాయి.
ఒంట్లో ఉష్ణోగ్రత ఎక్కువైతే చెమట గ్రంథుల ద్వారా శరీర ఉష్ణోగ్రతను చల్లబరిచే ప్రయత్నం జరుగుతుంది. ఈ కారణంతోనే తలలో చెమట అధికంగా వస్తుంది.
శరీర తీరును బట్టి మూడు నుంచి ఐదేళ్ల పాటు జుట్టు పెరుగుతుంది. దీనిని గ్రోత్ ఫేజ్, అనాజెన్ ఫేజ్ అని కూడా అంటారు. తర్వాత కొద్ది రోజుల పాటు ఎలాంటి మార్పు లేకుండా కొన్ని రోజుల తర్వాత చివరకు రాలిపోతాయి.
జుట్టు ఊడిపోయే దశను టీలోజెన్ ఫేజ్‌గా పిలుస్తారు. పాత జుట్టు రాలిపోయి కొత్త జుట్టు పుట్టుకొస్తుంది. ఇది జీవిత కాలం అంతా కొనసాగుతుంది.
శరీరంలో వెంట్రుకలు ఉండే ప్రతి భాగంలో వివిధ దశల్లొ కొత్త జుట్టు రావడం, పాతవి రాలిపోవడం కొనసాగుతుంది.
తల మీద వెంట్రుకలు నిరంతరం ఒకేలా ఉండవు. అవి నిరంతరం పుట్టి, పెరిగి, రాలిపోతుంటాయి.
సహజసిద్ధంగా వెంట్రుకలు ఊడిపోవడం సాధారణమే అయినా శరీర జీవ క్రియలలో మార్పుల వల్ల జుట్టు రాలిపోతుంటే అది అనారోగ్యంగా భావించాలి.
స్త్రీలలో సాధారణంగా గర్భధారణ తర్వాత హార్మోన్లు పెరగడం వల్ల జుట్టు కూడా పెరుగుతుంది. ప్రసావానంతరం హార్మోన్లు తగ్గి అందులో అసమతుల్యత కారణంగా ప్రసవం తర్వాత ఆర్నెల్ల వరకు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
జుట్టు అసహజంగా రాలిపోవడం చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను ఆరోగ్య సమస్యగా గుర్తించకుండా సౌందర్య సమస్యగా భావిస్తుంటారు.
నేల మీద గడ్డి మొక్కలు ఏపుగా, పచ్చగా,ఆరోగ్యంగా పెరగాలంటే నీరు, ఆహారం, పటిష్టమైన చెట్ల వేర్లు అవసరం అవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా ఇదే వర్తిస్తుంది.
ఉష్ణోగ్రత, నీటి కొరత వల్ల మొక్కలు ఎండిపోయినట్టే జుట్టును కూడా రకరకాల కారణాలు ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం, ఉష్ణోగ్రత బయటకు వెళ్లే క్రమంలో తలలో జుట్టు రాలిపోవచ్చు.
పోషకాహార లోపం, హార్మోనుల సమస్యలు, మానసిక ఆందోళనలు, నిద్రలేమి, వంశపారంపర్య సమస్యలు, వ్యాధులు, మందుల వాడకం వంటి కారణాలతో జుట్టు రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది.
స్త్రీలలో అధిక రుతుస్రావం వల్ల కూడా ఐరన్ లోపంతో జుట్టు రాలిపోవచ్చు.
శరీరంలో తలపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోతే అలోపిషియా టోటాలిస్, శరీరంపై వెంట్రుకలన్నీ రాలిపోతే అలోపిషియా యూనివర్షాలిస్ అంటారు,
ఒక్కోసారి ఏ కారణంల లేకుండా తలలో ఒక భాగంలో జుట్టు ఊడిపోయి మచ్చలా ఏర్పడుతుంది. క్రమంగా తలలో ఇతర భాగాల్లో కూడా ఇలా జరగొచ్చు. దీనిని అలోపిషియా ఏరియేటా అంటారు. గడ్డాలు, మీసాలు, కనుబొమ్మల్లో కూడా ఇలా జరగొచ్చు.
టైఫాయిడ్ వంటి దీర్ఘకాలిక జ్వరాలు, ప్రొటీన్స్, ఐరన్ లోపం, విటమిన్ ఎ ఎక్కువగా వాడినా జుట్టు రాలే సమస్యలు రావచ్చు.
దీర్ఘ కాలిక వ్యాధులు, క్యాన్సర్లలో జుట్టు రాలిపోయే సమస్య కనిపిస్తుంది. వివిధ రకాల మందుల వల్ల కూడా జుట్టు బాగా రాలిపోతుంది. తలలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల వల్ల కుదుళ్లు దెబ్బతిని జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.
రకరకాల మందుల వల్ల జుట్టు రాలడం సమస్యలు వస్తాయి. జుట్టును బిగుతుగా కట్టడం, షాంపులు అధికంగా వాడటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
ఎక్కువగా దువ్వెనతో దువ్విన జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుంది. దువ్వెన దంతాలు మృదువుగా ఉండాలి.
బహిష్టు ఆగిపోయిన స్త్రీలలో టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల జుట్టు తగ్గిపోవడం జరుగుతుంది.
లైంగిక సంపర్కం సమయంలో పురుషుడు త్వరగా స్కలనం చెందడమే శ్రీఘ్ర స్కలనం అనే ఆరోగ్య సమస్య.ఇది లైంగిక సంతృప్తిని ప్రభావితం చేస్తుంది.