జ్వరం అంటే శరీరం మీద రోగకారక జీవులు దాడి చేసినా, శరీరం సాధారణంగా పనిచేసే పరిస్థితికి భిన్నమైన పరిస్థితి ఏర్పడినపుడు చేసే సంకేతమే జ్వరం
By Bolleddu Sarath Chandra Nov 14, 2024
Hindustan Times Telugu
శరీర ఉష్ణోగ్రత పెరిగినంత మాత్రాన ఆరోగ్యం పాడైనట్టు కాదు,శరీర ఉష్ణోగ్రత పెరగడం సంపూర్ణ ఆరోగ్య లక్షణం కూడా కాదు. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే శరీర ఉష్ణోగ్రత క్రమబద్దంగా ఉండాలి. ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించే ఏర్పాట్లు శరీరంలో ఉంటాయి
మన చుట్టూ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినా, తగ్గినా శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4డిగ్రీల ఫారిన్‌హీట్ మాత్రమే ఉంటుంది. మెదడులో ఉండే హైపోథాలమస్ గ్రంథి థర్మో స్టాట్ పరికరంలా పనిచేస్తూ ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది.
చుట్టూ వాతావరణం వేడిగా ఉన్నా, శారీరక శ్రమ ఎక్కువైనా, అస్వస్థతగా ఉన్నా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. హైపోథాలమస్ ఆదేశాలతో చర్మంలోని రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. దీని వల్ల చర్మానికి ఎక్కువగా రక్త ప్రసరణ ఉంటుంది. శరీరంలోపలి వేడిని చర్మం ద్వారా బయటకు పంపుతుంది.
శరీరంలో కావాల్సిన వేడి పుట్టడానికి ఇంధనం ఆహారం నుంచి లభిస్తుంది. జ్వరం అనేది జబ్బు కాదు, అనేక జబ్బుల్లో జ్వరం ఒక లక్షణం మాత్రమే. జ్వరం అనేది శరీరంలో ఎమర్జెన్సీ సైరన్ వంటిది శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో తెల్ల రక్తకణాలు పైరోజెన్స్ అనే రసాయినాలను విడుదల చేస్తాయి. వీటి వల్ల హైపోథాలమస్‌ను ప్రభావితం చేస్తాయి.
శరీరంలో కణాలు, మాంసకృతులు నాశనమవుతుంటే మెదడు అలర్ట్ అవుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే నాడీమండలం, హర్మోనులు చురుగ్గా పనిచేస్తాయి. జలుబు, ముక్కు వెంట నీరు కారడం వంటి లక్షణాలతో వచ్చే జ్వరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శరీరం దానంతట అదే జ్వరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.
మెదడుకు గాయాలు, కణతులు, వడదెబ్బ వల్ల జ్వరాలను మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వీటి వల్ల ప్రాణాపాయం కలగవచ్చు.
జ్వరం 104 డిగ్రీలు దాటితే అది ప్రమాదకరం అవుతుంది. పిల్లల్లో ఫిట్స్ రావొచ్చు. 104 డిగ్రీలకు పైబడిన జ్వరం ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత ఎక్కువ ప్రమాదకరం అవుతుంది.వీలైనంత త్వరగా వైద్యం అందించాలి.
సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కోసారి 97-99 డిగ్రీలు కూడా ఉంటుంది. 100డిగ్రీల లోపు జ్వరాలను శరీరం దానంతటే అది సరిచేసుకుంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.