శరీరంలో ఉదరంలో భాగాలను, ఛాతిలోని భాగాలను విడదీస్తూ ఉదరవితానం(డయాఫ్రం) అనే పొర ఉంటుంది. ఈ పొర సక్రమంగా పనిచేయకపోతే వెక్కిళ్లు వస్తాయి.
శ్వాస క్రియను నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది.
డయాఫ్రం చర్యలను కూడా మెదడులోని ప్రత్యేక కేంద్రం నియంత్రిస్తుంది.
మెదడులోని కేంద్రం నుంచి ఫ్రెనిక్ నాడికి దాని నుంచి డయాఫ్రంకు సమాచారం చేరుతుంది.
మనం ఊపిరి పీల్చుకున్నపుడు డయాఫ్రం వాల్ ముడుచుకుంటుంది. ఊపిరితిత్తులలో గాలి నిండుతుంది.
గుండె, ఊపిరితిత్తులు ఉండే ఉర:కుహరం పెద్దదిగా మారుతుంది.
డయాఫ్రం తిరిగి సాధారణ స్థితికి రాగానే ఊపిరి తిత్తులలో గాలి బయటకు పోయి కుహరం సాధారణ స్థితికి చేరుతుంది.
డయాఫ్రం ముడుచుకుని, మామూలుగా కావడం క్రమపద్ధతిలో జరిగినపుడు శ్వాసక్రియ సక్రమంగా జరుగుతుంది.
డయాఫ్రం సక్రమంగా పనిచేయకపోతే ఆ క్రమం తప్పుతుంది. అప్పుడు లోపలకు గాలి పీల్చుకున్నపుడు స్వరపేటిక ఆకస్మాత్తుగా మూతబడుతుంది. ఫలితంగా హిక్ అనే శబ్దం వస్తుంది.
డయాఫ్రం తిరిగి సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ వెక్కిళ్లు కొనసాగుతాయి.
వెక్కిళ్లు ఆరోగ్య సమస్య కాదు, ఆగకుండా ఎక్కువగా కొనసాగితే ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.
తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!