చెవులలో ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? ఏం చేస్తే తగ్గుతాయి?

By Ramya Sri Marka
Feb 09, 2025

Hindustan Times
Telugu

చెవి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం, ఇది వినడానికి సహాయపడుతుంది. ఐదు ఇంద్రియాలలో చెవి ఒకటైన చెవి ఆరోగ్యంగా లేకపోతే మనం ఖచ్చితంగా శబ్దాలను వినలేము.

కొన్నిసార్లు చెవులలో రకరకాల సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటివి చాలా ఇబ్బంది పెడతాయి. వీటికి కారణమేంటి, ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం.

సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఇది వినికిడి సమస్యలకు కూడా దారితీస్తుంది. 

చెవి ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా లేదా వైరస్ల వల్ల సంభవిస్తాయి. దీని వలన చెవి నొప్పి, దురద,  చెవిబరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు.

చెవిని తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల, మురికి  పేరుకుపోతుంది.  ఇది చెవిలో మొటిమలు లేదా పుండ్లను కలిగిస్తుంది. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. అలాగే చీము కూడా రావచ్చు.

పెద్ద పెద్ద శబ్దాలు తరచుగా వినడం లేదా  వృద్ధాప్యం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు, వినికిడి సమస్యలు  సంభవించవచ్చు.

చెవులను పదునైన వస్తువులతో శుభ్రం చేయడం వల్ల కూడా చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు. చెవుల్లోకి నీరు పోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

మెనియర్ అనేది చెవులలో శబ్దం, తలతిరగడం,  వినికిడి సమస్యలను కలిగించే తీవ్రమైన పరిస్థితి.

చెవి క్యాన్సర్ అరుదైన వ్యాధి, కానీ క్యాన్సర్ చెవి లోపల లేదా వెలుపల ఏర్పడవచ్చు. ఈ సమస్య దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ లేదా మరొక వ్యాధి కారణంగా ఉండవచ్చు.

మీ చెవులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, చెవి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అధికంగా శుభ్రం చేయకండి.అధిక శబ్దం, నీటి నుండి మీ చెవులను రక్షించుకోండి.

మీ చెవులలో ఏదైనా సమస్య, నొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సొంత వైద్యం పనిచేయకపోతే వినికిడి శక్తిని కోల్పేయే ప్రమాదముంది. మీ చెవులను జాగ్రత్తగా చూసుకోండి.

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest