కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ ఎందుకు సోకుతుంది? కారణాలు ఏంటీ?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 11, 2025

Hindustan Times
Telugu

వలస పక్షులు, నీటి పక్షులు, ఇతర అడవి పక్షుల ద్వారా ఈ వైరస్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది.

Image Source From unsplash

వైరస్ సోకిన పక్షుల రెట్టలు, లాలాజలం, ఇతర స్రావాల ద్వారా కోళ్లు ఈ వ్యాధికి గురవుతాయి.

Image Source From unsplash

వైరస్ సోకిన కోళ్లతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు.. ఆరోగ్యకరమైన కోళ్లు కూడా ఈ వ్యాధి బారిన పడతాయి.

Image Source From unsplash

వైరస్ సోకిన కోళ్లు తిన్న ఆహారం, నీరు తీసుకోవడం వల్ల కూడా బర్డ్ ఫ్లూ వస్తుంది. వాటికి సరైన ఆహారం, నీరు అందించాలి. 

Image Source From unsplash

కొన్ని సందర్భాలలో, గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అనుమానం వచ్చిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source From unsplash

బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి కలిగిన కోళ్లు బర్డ్ ఫ్లూకు సులభంగా గురవుతాయి. వ్యాధి సోకిన పక్షులను వెంటనే గుర్తించి వేరు చేయాలి.

Image Source From unsplash

చల్లటి, తేమతో కూడిన వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నివారించడానికి కోళ్లు, పక్షులను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. 

Image Source From unsplash

మానవులు కూడా ఈ వైరస్‌ను ఒక చోటు నుండి మరొక చోటుకు వ్యాప్తి చేయగలరు. దీని వల్ల మనుషులకు కూడా హాని కలుగుతుంది. జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. 

Image Source From unsplash

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest