మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, మూత్రమండలం, మూత్రనాళ వ్యాధులు గుర్తించడం ఎలా?

By Sarath Chandra.B
Feb 19, 2025

Hindustan Times
Telugu

మూత్ర మండలానికి వచ్చే వ్యాధులలో మూత్రాశయ వ్యాధి ఒకటి. మూత్రాశయానికి ఇష్షిరెషియాకొలై అనే బాక్టీరియా కారణంగా సిస్టైటిస్‌ అనే మూత్రాశయ వ్యాధి వస్తుంది.

మూత్రాశయం, మూత్రనాళానికి మాత్రమే ఇన్‌ఫెక్షన్‌ సోకితే దానిని దిగువ మూత్ర మండల ఇన్ఫెక్షన్‌ అంటారు. మూత్ర పిండాలకు, మూత్ర నాళికకు కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఎగువ మూత్ర మండల ఇన్‌ఫెక్షన్‌ అని అంటారు. 

కొత్త పెళ్లైన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించడం వల్ల హనీమూన్‌ సిస్టైటిస్‌ అని కూడా అంటారు. హనీమూన్‌ జంటలతో పాటు ఎవరికి ఎప్పుడు ఈ సమస్య వచ్చినా దానిని హనీమూన్‌ సిస్టైటిస్‌ అనే అంటారు.

సిస్టైటిస్‌లో కొన్ని సార్లు మూత్రంలో రక్తం, చీము వచ్చే అవకాశం ఉంటుంది.అకస్మాత్తుగా జ్వరం, వణుకు, వికారం, వాంతుల కూడా కలుగుతాయి. 

పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం ఉంటాయి. మూత్రం పోసేటప్పడు చురుకు, మంట ఉంటాయి.

మూత్రశయానికి ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తరచూ మూత్రానికి వెళ్లాల్సి  వస్తుంది. జ్వరం వికారం కలుగుతాయి. 

మూత్ర పిండాలు, మూత్ర నాళాలకు కూడా  ఇన్‌ఫెక్షన్‌ సోకితే వికారంతో పాటు వాంతులు, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి కలుగుతాయి. నాడి వేగం పెరుగుతుంది. 

ప్రోటోజువా, బాక్టీరియా, వైరస్‌ల కారణంగాఈ సమస్య వస్తుంది. ఇ కొలై, స్టెఫలో కోకై, క్లెబిషియెల్లా, ప్రోటియస్‌, కాండిడా, ఎంటరోకోకై, సోడోమోనాస్‌, ట్యూబర్ క్యులోసిస్‌ వల్ల మూత్రాశయ సమస్యలు వస్తాయి.

బహ్య జననేంద్రియాల్లో పోగైన బాక్టీరియా మూత్ర నాళం ద్వారా మూత్రాశయానికి వ్యాపించడం వల్ల  మూత్ర పిండాల్లో సమస్యలు ఏర్పడతాయి.

మలద్వారం, మూత్ర నాళానికి దగ్గరగా ఉండటం వల్ల ఆడవారిలో.. పురుషుల కంటే ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. 

మూత్రాశయంలో, మూత్ర నాళంలో రాళ్లు ఉన్నా, గడ్డలు ఉన్నా మూత్ర మండలంలో రాళ్లు ఉన్నా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

మగవారిలో మూత్ర నాళం సన్నబడటం వల్ల, ప్రోస్టేట్ గ్రంథి పెరిగినా, స్టిరాయిడ్లు వాడేవారిలో,  క్యాన్సర్, డయాబెటిస్ ఉన్న వారిలో మూత్రశాయ సమస్యలు వస్తాయి.

ఆడవారిలో గర్బధారణ సమయంలో, పెరిగే గర్భం వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి కలిగించడం వల్ల మూత్ర మండల వ్యాధులు వస్తాయి. 

కొత్తగా పెళ్లైన వారిలో, లైంగిక వ్యాధులు ఉన్న వారిలో మూత్ర మండల సమస్యలు  ఏర్పడతాయి. సకాలంలో వైద్యం చేయకపోతే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. 

వేసవిలో నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?