పసిపిల్లలు ఏడ్వడం మామూలే. కానీ పిల్లల ఏడుపులో రకాలు ఉన్నాయని చైల్డ్ సైకాలజీ నిపుణులు అంటున్నారు. పిల్లలు ఒక్కో సమయంలో ఒక్కే విధంగా ఏడుస్తుంటారు. పిల్లల ఏడుపును బట్టి కారణాలు తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
pexels
By Bandaru Satyaprasad May 20, 2025
Hindustan Times Telugu
శిశువులు ఏ విషయానైనా ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. వీటిలో ముఖ్యమైంది ఆకలి. తమకు ఆకలి వేసిన ప్రతీసారి పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తారు.
pexels
పిల్లలు తల్లి దగ్గర పాలు తాగినప్పుడు కొన్ని సందర్భాల్లో గాలి కూడా మింగేస్తారు. దీంతో పొట్టలో అసౌకర్యంగా అనిపించి ఏడుస్తారు. అందుకే పిల్లలు పాలు తాగిన తర్వాత వారిని భుజంపై వేసుకోమని వైద్యులు సూచిస్తారు. ఇలా చేస్తే వారికి తేన్పు వచ్చి అంతా సర్దుకుంటుంది.
pexels
చంటి పిల్లలు పడుకునే బెడ్ సరిగ్గా లేకపోయినా....అసౌకర్యంగా ఉన్నా ఏడుస్తారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు ఏడుస్తుంటారు.
పిల్లలకు ఆకలిగా లేకపోయినా...ఒక్కొసారి తల్లులు పాలు అధికంగా పడుతుంటారు. దీంతో పిల్లలకు అసౌకర్యంగా మారి ఏడుపు స్టార్ట్ చేస్తారు. పొట్టలో పాలు ఎక్కువై జీర్ణం కాక ఏడుస్తారు.
pexels
తమ తల్లిదండ్రులు దగ్గరికి రప్పించుకోవాలని ఉద్దేశంతో తాపీగా మధ్య మధ్యలో ఉ..ఊ అంటూ ఏడుస్తారు. ఇలాంటి ఏడుపును పసిగట్టి వెంటనే పిల్లలకు దగ్గరకు వెళ్లకుండా నాలుగైదు నిమిషాలు ఆగి వెళ్లాలి. లేకుంటే పిల్లలు ఇదే అసలుగా తీసుకుని పదే పదే ఏడుస్తుంటారు.
pexels
కాస్త చల్లదనానికే పిల్లలకు జలుబు చేస్తుంది. దీంతో పిల్లల ముక్కు మూసుకుపోతుంది. ముక్కు నుంచి గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తారు. జలుబు చేసినప్పుడు పాలు తాగడానికి ఇబ్బంది పడతారు.
pexels
వేడి వాతావరణంలో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. వేసవి కాలంలో తరచూ పిల్లలకు దుస్తులు మార్చాలి. ఇంట్లో కాస్త చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
pexels
డైపర్ల వల్ల కలిగే అసౌకర్యానికి పిల్లలు ఏడుస్తారు. అందుకే డైపర్ నిండిపోగానే మారుస్తుండాలి. పిల్లలు మల, మూత్ర విసర్జన చేసిన తర్వాత డైపర్లు మారుస్తుండాలి లేదంటే చర్మసంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
pexels
పిల్లల్లో కడుపు, చెవి నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వీటి కారణంగా శిశువులు ఏడుస్తుంటారు. అనారోగ్యం సమయంలోనూ పిల్లలు ఏడుపు అధికంగాఉంటుంది.
pexels
పిల్లలకు ఆకలి ఎక్కువగా ఉన్న సమయంలో పెద్దగా మధ్యలో విరామం ఇవ్వకుండా ఏడుస్తుంటారు. కడుపు నొప్పి, చెవి నొప్పి సమయంలో ఆపకుండా కంటీన్యూగా ఏడుస్తుంటారు. ఈ సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి.
pexels
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు