వేసవి వేడిలో శరీరానికి లిక్విడ్ ఫుడ్స్ బెస్ట్ అంటున్నార నిపుణులు. తాజా మామిడికాయ రసం తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.
Unsplash
By Anand Sai
May 19, 2024
Hindustan Times
Telugu విటమిన్లు, పీచుపదార్థాలు, ఇతర పోషకాలు అధికంగా ఉండే మామిడికాయ రసం తాగడం మంచిది.
Unsplash
మామిడి రసంలో విటమిన్ సి, కాల్షియంతో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
Unsplash
మామిడి రసం జీర్ణక్రియలో సహాయపడుతుంది, అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి.
Unsplash
మామిడి రసంలో విటమిన్ సి చర్మానికి అవసరమైన, ముడతలు రాకుండా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడమే కాకుండా వాపును కూడా తగ్గిస్తుంది.
Unsplash
మామిడికాయ రసంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా మంచిది.
Unsplash
అయితే మామిడి అధిక వినియోగం కొన్ని దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. జీర్ణ రుగ్మత, కొందరికి అలర్జీ రావచ్చు. తక్కువ మోతాదులో తీసుకోవాలి.
Unsplash
మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి