గర్బ నిరోధక పద్ధతుల్లో రెండు రకాలు ఉంటాయి. సహజ గర్భ నిరోధక పద్ధతులు, కృత్రిమ నిరోధక పద్ధతుల్లో గర్భాన్ని నిరోధించవచ్చు.
సహజ గర్బ నిరోధక పద్ధతిలో అండం విడుదలయ్యే సమయం తెలుసుకుని ఆ సమయంలో లైంగిక కలయిక లేకుండా ఉండటం సహజ పద్ధతుల్లో ముఖ్యమైనది
సహజ గర్భ నిరోధక పద్ధతుల్లో రిథమ్ మెథడ్, మ్యూకస్ మెథడ్, స్ఖలనం ముందు అంగాన్ని బయటకు తీయడం వంటి పద్ధతులు ఉంటాయి.
28 రోజుల రుతు చక్రం ఉన్న స్త్రీలలో 14వ రోజు అండం విడుదల అవుతుంది. అండం విడుదలయ్యే కొన్ని రోజుల ముందు, తర్వాత లైంగిక చర్యలకు దూరంగా ఉండటం రిథమ్ మెథడ్ అంటారు..
రుతుక్రమంలో అందరిలో ఒకేలా ఉండదు కాబట్టి రిథమ్ పద్ధతిని అనుసరించడం కష్టం..
రిథమ్ పద్దతిలో పిల్లలు పుట్టకుండా కాకుండా పిల్లలు పుట్టడం కోసం కూడా వాడొచ్చు.
పిల్లలు పుట్టకూడదు అనుకునే వారు, కావాలనుకునే వారు రిథమ్ పద్ధతి ఫాలో అవ్వొచ్చు. దీనికి అండం విడుదలయ్యే సమయం ఖచ్చితంగా తెలియాలి.
మ్యూకస్ విధానంలో యోని స్రవంలో మార్పులు స్త్రీలకు అర్థం అవుతాయి. దానికి అనుగుణంగా అండం విడుదలయ్యే సమయాన్ని గుర్తించవచ్చు.
స్త్రీ యోని స్రవాలు వీర్య కణాలు ఎక్కువ కాలం జీవించడానికి అనువుగా ఉంటాయి.
అండం విడుదలతో పాటు యోని స్రవాలు అధికమై అండం విడుదలకు ముందు అధికం అవుతాయి. దీనిని పీక్ డే లేదా శిఖర దశ అంటారు. మర్నాడు అండం విడుదల అవుతుంది.
శిఖర దశ నాలుగో రోజు నుంచి మళ్లీ బహిష్టు మొదలయ్యే వరకు గర్భం వచ్చే అవకాశం ఉండదు. దీనిని సేఫ్ పీరియడ్ అంటారు.
పురుషాంగాన్ని స్ఖలనం ముందే బయటకు తీయడం సహజ పద్దతుల్లో ఒకటి. స్ఖలనానికిి ముందు వీర్యంలో ఒకటి రెండు బొట్లు కూడా గర్భధారణకు దారి తీయొచ్చు.అయితే ఇందులో వీర్యకణాలు తక్కువగా ఉంటాయి.
వీర్యకణాలు యోనిలో ప్రవేశించకుండా గుర్తుంచుకోవడం ముఖ‌్యమైన విషయం. వీర్యకణాలు యోని వెలుపల పడినా ఒక్కోసారి గర్భధారణ జరుగుతుంది.
ఒకటి కంటే ఎక్కువ సార్లు లైంగిక చర్యలకు పాల్పడితే కూడా ఈ పద్ధతి వికటిస్తుంది. పురుషాంగంలో మిగిలి ఉన్న వీర్యం గర్భానికి కారణం అవుతుంది.