ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయో తెలుసా?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 01, 2025

Hindustan Times
Telugu

ఆడ దోమలు గుడ్లు పెట్టడానికి రక్తం అవసరం. అవి మనల్ని కుడతాయి. మగ దోమలు పుప్పొడి, పండ్ల రసాలపై ఆధారపడి ఉంటాయి.

Image Source From unsplash

మనం శ్వాసించినప్పుడు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాము. ఇది దోమలను ఆకర్షిస్తుంది. పడుకున్నప్పుడు దోమలు ఎక్కువగా కుడతాయి.

Image Source From unsplash

గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. దీని వల్ల వారిని దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.

Image Source From unsplash

దోమలు వెచ్చని శరీర ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత లేదా వేడిగా ఉన్నప్పుడు శరీరం వేడిగా ఉంటుంది. దీని వలన దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.

Image Source From unsplash

చెమటలో లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి దోమలను ఆకర్షిస్తాయి.

Image Source From unsplash

కొన్ని పరిశోధనల ప్రకారం.. O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయి.

Image Source From unsplash

మీ చర్మంపై ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా దోమలను ఆకర్షిస్తాయి. నల్లటి, ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి. 

Image Source From unsplash

దోమల బారినుంచి తప్పించుకోవడానికి స్ప్రేలను ఉపయోగించాలి. దోమతెరలను వాడాలి. లేత రంగు దుస్తులను ధరించాలి.

Image Source From unsplash

సహజంగా హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు ఇవిగో

pixabay