మన దేశంలో ఎత్తైన హానుమాన్ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలు ఇవే

Image Source From unsplash

By Basani Shiva Kumar
May 11, 2025

Hindustan Times
Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మండపంలో.. మడపం హనుమాన్ విగ్రహం ఉంది. దీని ఎత్తు 176 అడుగులు. దేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం ఇది. వంశధార నది ఒడ్డున ఉంది.

Image Source From unsplash

కర్ణాటక రాష్ట్రంలోని బిదనగెరెలో పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దీని ఎత్తు 161 అడుగులు. ఈ విగ్రహం ఐదు ముఖాలతో, పది చేతులతో ఉంటుంది.

Image Source From unsplash

ఏపీలోని పరిటాలలో వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి విగ్రహం ఉంది. దీని ఎత్తు 135 అడుగులు. విజయవాడకు దగ్గరలో ఉన్న పరిటాల గ్రామంలో ఈ విగ్రహం ఉంది.

Image Source From unsplash

ఒడిశాలోని దామన్జోడిలోనూ ఎత్తైన హనుమాన్ విగ్రహం ఉంది. దీని ఎత్తు 108.9 అడుగులు. ఈ విగ్రహం దామన్జోడి పట్టణంలో ఉంది. దూరం నుండి కూడా కనిపిస్తుంది.

Image Source From unsplash

హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో జాఖూ హనుమాన్ విగ్రహం ఉంది. దీని ఎత్తు 108 అడుగులు. జాఖూ కొండపై ఉన్న ఈ విగ్రహం.. షిమ్లాలో ప్రధాన ఆకర్షణ.

Image Source From unsplash

ఢిల్లీలో సంకట్ మోచన్ హనుమాన్ విగ్రహం ఉంది. దీని ఎత్తు 108 అడుగులు. ఝండే వాలాన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ భారీ విగ్రహం ఉంది.

Image Source From unsplash

మహారాష్ట్రలోని నందురాలో హనుమాన్ మూర్తి విగ్రహం ఉంది. దీని ఎత్తు 105 అడుగులు. జాతీయ రహదారి 6 పై ఉన్న ఈ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Image Source From unsplash

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్‌లో హనుమత్ ధామ్ విగ్రహం ఉంది. దీని ఎత్తు.. 100 అడుగులు ఉంటుంది. ఖన్నౌత్ నది ఒడ్డున బిస్రత్ ఘాట్‌లో ఈ విగ్రహం ఉంది.

Image Source From unsplash

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash