పరగడుపున ఎండు ద్రాక్ష తింటే ఏమవుతుందంటే..

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Sep 03, 2024

Hindustan Times
Telugu

ఎండు ద్రాక్షల్లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఉదయాన్నే పరగడుపున తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Pexels

ఎండు ద్రాక్షల్లో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో ప్రతీరోజు తింటే శరీరంలో రక్తాన్ని పెంచగలవు. బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉండేందుకు కూడా తోడ్పడతాయి.  

Photo: Pexels

ఎండు ద్రాక్షల్లో విటమిన్ సీ, కే, బీటా కరోటిన్ ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల చర్మం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మొటిమలు తగ్గడంతో పాటు చర్మపు మెరుపు పెరుగుతుంది. 

Photo: Pexels

ఎండు ద్రాక్షల్లో విటమిన్ బీ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. అందుకే పరగడుపున నానబెట్టిన ఎండు ద్రాక్షలు ప్రతీరోజు తింటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. చాలా ఇన్‍ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. 

Photo: Pexels

ఎండుద్రాక్షల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వీటిని తింటే మలబద్దకం, కడుపు మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 

Photo: Pexels

ఎండు ద్రాక్షలో కాల్షియం కూడా ఉంటుంది. పరగడుపున వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం కూడా మెరుగవుతుంది. 

Photo: Pexels

చీరలో చందమామలా మెరిసిన కాజల్

Photo: Instagram