కాల్షియం పెరగటం కోసం ఏం తీసుకోవాలి..? వీటిపై ఓ లుక్కేయండి

By Maheshwaram Mahendra Chary
May 11, 2025

Hindustan Times
Telugu

శరీరంలో కాల్షియం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. 

image credit to unsplash

కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా కొన్ని ఆహారాలు, పానీయాలను తీసుకోవటం ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు.

image credit to unsplash

కాల్షియం స్థాయిలను సహజ పద్ధతిలో పెంచుకోవచ్చు. ముందుగా ఆహారం విషయంలో వైవిధ్యాన్ని పెంచుకోవాలి. రోజూ అన్నం, చపాతి మాత్రమే కాకుండా ఇతర ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

image credit to unsplash

కాల్షియం పెరగటం కోసం రాగులను డైట్ లో చేర్చుకోండి. వీటిల్లో ఐరన్, అమైనో యాసిడ్లు, ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటాయి. 

image credit to unsplash

కాల్షియం పెరగటం కోసం  పాలు, పెరుగు, చిక్కటి మజ్జిగ, పన్నీర్‌ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

కాల్షియం కోసం ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బచ్చలికూర, మెంతికూర వంటి వాటిని డైట్ లో చేర్చుకోవాలి.

image credit to unsplash

పొట్టుతీయని మినుములతో చేసిన ఆహారం ఎక్కువగా  తీసుకోవాలి. ఇలా చేస్తే కాల్షియం స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే శనగలు, పెసలను కూడా ఉడికించి తీసుకోవచ్చు. 

image credit to unsplash

రుహానీ శర్మ న్యూ గ్లామర్ ఫొటోలు.. బ్లూ బ్రాలో హాట్ హాట్ సోయగాలు