డయేరియా తగ్గేందుకు ఉపకరించే ఆహారాలు

Photo; Pexels

By Chatakonda Krishna Prakash
Aug 31, 2024

Hindustan Times
Telugu

డయేరియా (అతిసార/ విరేచనాలు, వాంతులు) తగ్గేందుకు మందులు వేసుకోవడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా తగ్గేందుకు కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని రకాల ఫుడ్స్ ఇవే..

Photo: Pexels

అరటి పండు, అరటి కాయల్లో ఫైబర్, పొటాషియం, ప్రొబయోటిక్ కారకాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగి, డయేరియా తగ్గేందుకు ఉపకరిస్తాయి. 

Photo: Pexels

బంగాళదుంపల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నీళ్ల విచేచనాలు తగ్గేందుకు ఇది సహకరిస్తుంది. డయేరియా నుంచి కోలుకునేందుకు బంగాళదుంప తినడం ఉపయోగపడుతుంది.  

Photo: Pexels

యగర్ట్, పెరుగు, మజ్జిగ లాంటి ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే డయేరియా నుంచి వేగంగా ఉపశమనం కలిగేందుకు ఉపయోగపడతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు పాలు ఎక్కువగా తీసుకోకూడదు.  

Photo: Pexels

అల్లం, తేనెను కలిపి తీసుకోవడం వల్ల కూడా డయేరియా నుంచి ఉపశమనం కలుగుతుంది. తేనె, అల్లాన్ని కలిపి టీ చేసుకోవచ్చు. లేకపోతే మీరు తీసుకునే ఆహారంలో ఇవి వేసుకోవచ్చు.

Photo: Pexels

డయేరియాతో బాధపడుతున్న సమయంలో కొబ్బరినీళ్లు, పుచ్చకాయలు లాంటివి తీసుకోవడం డీహైడ్రేషన్ అవకుండా ఉంటుంది. వీటిలోని పొటాషియం డయేరియా తగ్గేందుకు సహకరిస్తుంది. 

Photo: Pexels

బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న‌ది సోనియా ఆకుల‌. 

twitter